Akshay as Chhatrapati Shivaji Maharaj: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ తర్వాత ‘బెల్ బాటమ్’ సినిమాతో థియేటర్స్‌లో పలకరించారు. ఆ తర్వాత దీపావళి సందర్భంగా విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు అక్షయ్ కుమార్. కానీ ఈ యేడాది ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్, రక్ష బంధన్, రీసెంట్గా రామ్ సేతు సినిమాలతో పలకరించారు. ఇందులో రామ్ సేతు సినిమా మాత్రమే ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది. అంతేకాదు ఈ యేడాది తొలిసారి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాలో చారిత్రక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఆసంగతి పక్కనే పెడితే.. తాజాగా అక్షయ్ కుమార్.. భారతీయుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తున్నారు.
అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, హీరోలు, స్పోర్ట్స్ పర్సన్స్, మాపియా డాన్స్ ఇలా ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఆకట్టుకునే అంశం ఉంటే.. ఆయా దర్శక, నిర్మాతలు, హీరోలు అటువంటి సబ్జెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో గత కొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులు వ్యక్తుల జీవితాలను వెండితెరపై వచ్చాయి. మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి.
Here’s the #FirstLook of AKSHAY KUMAR as CHHATRAPATI SHIVAJI MAHARAJ… Director #MaheshManjrekar’s #VedatMaratheVeerDaudleSaat is slated for release in #Diwali 2023. #AkshayKumar pic.twitter.com/Yx4XtBDzxx
— taran adarsh (@taran_adarsh) December 6, 2022
తాజాగా మరాఠా యోధుడు అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పేరు గడించి.. అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబును గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే పనిలో మేకర్స్ పడ్డారు. ఇప్పటికే ఈయన పై పలు చిత్రాలొచ్చాయి. తాజాగా అక్షయ్ కుమార్ .. ‘వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే మరాఠీ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అక్షయ్ కుమార్.. ఛత్రపతి శివాజీగా నడుచుకుంటూ వస్తోన్నట్టు ఓ టీజర్‌ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళంలో నాలుగు భాషల్లో 2023 దీపావళి కానుకగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
రీసెంట్గా ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా శివాజీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘బాల్ శివాజీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. Eros ఇంటర్నేషనల్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్, రవి జాద్ ఫిల్మ్స్ మరియు లెజెండ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మన దేశానికి చెందిన మూడు అగ్రశ్రేణి స్టూడియోలు ఈ భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ముఖ్యంగా ఆయన బాల్యంలో జరిగిన సంఘటనలు, చరిత్రలో ఇంత వరకు ఎవరు సృశించని స్టోరీతో ఆయన 12 నుంచి 16 యేళ్ల మధ్య జరిగిన సంఘటనలతో దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడే నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి జాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం కూడా ‘ఛత్రపతి శివాజీ’ జీవితాన్ని మూడు భాగాలుగా ‘సైరత్’ ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి ‘శివాజీ’ అని.. రెండో భాగానికి ‘రాజా శివాజీ’ మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేసారు.
ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇంత వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా ఇపుడు తెరకెక్కుతోన్న ‘బాల శివాజీ’ సినిమానైనా వెండితెరపై చూడాలనుకునే అభిమానులున్నారు. ఏది ఏమైనా మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు భారతీయ అసలు సిసలు యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కిస్తుండం ఆనందించదగ్గ పరిణామం. ఛత్రపతి శివాజీ మహారాజ్.. సామాన్య శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood news, Chatrapathi Shivaji Maharaj, Tollywood