Home /News /movies /

Akshay Kumar: జోరు మీదున్న అక్షయ్ కుమార్.. మరో కొత్త మూవీని షురూ చేసిన బాలీవుడ్ ఖిలాడి..

Akshay Kumar: జోరు మీదున్న అక్షయ్ కుమార్.. మరో కొత్త మూవీని షురూ చేసిన బాలీవుడ్ ఖిలాడి..

‘రక్షా బంధన్’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన అక్షయ్ కుమార్ (Twitter/Photo)

‘రక్షా బంధన్’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన అక్షయ్ కుమార్ (Twitter/Photo)

Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్.. మరో కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈయన హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘రక్షా బంధన్’ అనే సినిమా స్టార్ట్ చేసారు.

  Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్.. మరో కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈయన హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘రక్షా బంధన్’ అనే సినిమా స్టార్ట్ చేసారు. అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో తొలిసారి అన్నా చెల్లెల్ల సెంటిమెంట్‌తో ‘రక్షా బంధన్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ నలుగురు చెల్లెల్ల అన్నయ్యగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నానా పాటేకర్ అక్షయ్ కుమార్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక అక్షయ్ కుమార్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమాను జూలై 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈయన హీరోగా నటించిన ‘సూర్య వంశీ’ సినిమాను విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు.


  ఇక ‘రక్షా బంధన్’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్‌తో ధనుశ్‌తో కలిసి ‘అతరంగీ రే’ సినిమాను కంప్లీట్ చేసారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నారు.  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరోసారి గ్యాంగ్ స్టర్ బచ్చన్ పాండే పాత్రలో నటిస్తున్నాడు. నిర్మాత సాజిత్ నడియావాలాతో హీరో అక్షయ్ కుమార్ కు ఇది 10వ సినిమా. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో అర్షద్ వార్సీ నటిస్తున్నారు.

  ’బచ్చన్ పాండే’గా అక్షయ్ కుమార్ (Twitter/Photo)


  మరోవైపు అక్షయ్ కుమార్.. భారతీయ చారిత్రక యోధుడు ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్రపై ‘పృథ్వీరాజ్’ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు రామ్ సేతు అనే సినిమా చేస్తున్నారు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో  తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. మొత్తంగా అక్షయ్ కుమార్.. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా స్టార్ట్ చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akshay Kumar, Bell Bottom, Bollywood news, Raksha Bandhan, Sooryavanshi Movie

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు