Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: March 2, 2020, 2:50 PM IST
అక్షయ్,అజయ్,రణ్వీర్ సింగ్ ‘సూర్యవంశీ’ (Youtube/Credit)
బాలీవుడ్లో ఏ హీరో చేయనట్టుగా వరుస సినిమాలతో అక్షయ్ కుమార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, హౌస్‌ఫుల్ 4’, ‘గుడ్ న్యూస్’ వంటి సినిమాలతో వరుస సక్సెస్‌లను అందుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్.. ‘రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ’ సినిమా చేసాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ శెట్టి.. ముంబాయిలో ఇప్పటి వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. అంతేకాదు ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గణ్ సింగం పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే.. రణ్వీర్ సింగ్ ‘సింబా’ గా అలరించనున్నాడు. మరోవైపు ముంబాయి బాంబ్ బ్లాస్ట్‌ల వెనక ఉన్ మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం పాత్రలో జాకీ ష్రాఫ్ నటించాడు.
మొత్తంగా పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్.. పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్.. లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రపై పృథ్వీరాజ్ చౌహాన్ సినిమాలను చేస్తున్నాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 2, 2020, 2:35 PM IST