మళ్ళీ చిరంజీవినే నమ్మిన అక్షయ్..

మళ్ళీ చిరంజీవినే నమ్మిన అక్షయ్..

akshay in kaththi remake

ఠాగూర్.. విక్రమార్కుడు లాంటి సినిమాల రైట్స్ తీసుకుని వాటిని మన దర్శకులకే అప్పగించాడు సంజయ్. ఠాగూర్ సినిమాను గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ క్రిష్ హిందీలోకి తీసుకెళ్లాడు. ఇక విక్రమార్కుడుని రీమేక్ స్పెషలిస్ట్ ప్రభుదేవా రౌడీరాథోర్‌గా తెరకెక్కించాడు. రెండూ బాగానే ఆడాయి. దాంతో ఇప్పుడు కత్తిపై కన్ను పడింది.

 • Share this:
  పేరుకు బాలీవుడ్ హీరో కానీ అక్షయ్ కుమార్ మనసు మాత్రం ఎప్పటికీ దక్షిణాది ఇండస్ట్రీపైనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ సినిమాలు వస్తున్నాయి.. ఎప్పుడు ఏవి హిట్ అవుతున్నాయి అని ఎప్పుడూ చెక్ చేసుకుంటూనే ఉంటాడు ఖిలాడీ. ఇక రీమేక్ సినిమాలు చేయడంలోనూ అక్షయ్ కుమార్‌కు సాటిలేరు. నచ్చిన కథ దొరికితే వెంటనే అందులోకి దూరిపోతుంటాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడని తెలుస్తుంది. ఈయన త్వరలోనే చిరంజీవి సినిమా రీమేక్‌లో నటించనున్నాడు. అదే ఖైదీ నెం.150.  ఇక్కడ చిరు చేసింది కూడా రీమేక్ సినిమానే. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కత్తి సినిమాను తన రీ ఎంట్రీ కోసం వాడుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు ఇదే సినిమాను తన కోసం వాడేసుకుంటున్నాడు అక్షయ్ కుమార్. ఈయన త్వరలోనే కత్తి రీమేక్‌లో నటించబోతున్నాడనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతుంది. సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే కత్తి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తాను మాత్రం తెరకెక్కించడం లేదు. మరో దర్శకుడికి బాధ్యతలు ఇచ్చి.. నిర్మాతగా ఉండబోతున్నాడు.

  గతంలోనూ ఈయన చేసిందిదే. ఠాగూర్.. విక్రమార్కుడు లాంటి సినిమాల రైట్స్ తీసుకుని వాటిని మన దర్శకులకే అప్పగించాడు సంజయ్. ఠాగూర్ సినిమాను గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ క్రిష్ హిందీలోకి తీసుకెళ్లాడు. ఇక విక్రమార్కుడుని రీమేక్ స్పెషలిస్ట్ ప్రభుదేవా రౌడీరాథోర్‌గా తెరకెక్కించాడు. రెండూ బాగానే ఆడాయి. దాంతో ఇప్పుడు కత్తిపై కన్ను పడింది. 2014లో విడుదలైన ఈ సినిమాను రైతు సమస్యల ఆధారంగా మురుగదాస్ తెరకెక్కించాడు. అవార్డులతో పాటు రికార్డులు కూడా అందుకుంది కత్తి. పదేళ్ల తర్వా త తన రీ ఎంట్రీ కోసం కత్తి కథనే చిరు తీసుకున్నాడంటే ఇందులో ఎంత విషయం ఉందో అర్థమైపోతుంది. అన్నట్లుగానే తెలుగులోనూ ఖైదీ నెం.150 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు హిందీ వంతు. మరి అక్కడ ఎవరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు ఎవరైనా అక్కడ కత్తి పట్టేది మాత్రం అక్షయ్ కుమారే.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: