AKSHAY KUMAR AGAIN DONATES 2 CRORE RUPEES TO MUMBAI POLICE DEPARTMENT TA
అక్షయ్ కుమార్ నిజంగానే నువ్వు దేవుడివి స్వామి.. సరిలేరు నీకెవ్వరు..
అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)
కరోనా పై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. కానీ కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో విరాళాలు ప్రకటిస్తూ సంచలనం రేపుతున్నాడు.
కరోనా పై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. కానీ కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో విరాళాలు ప్రకటిస్తూ సంచలనం రేపుతున్నాడు. అసలు అక్కీ ప్రకటించిన విరాళాలు చూసి మిగతా హీరోలు ఇచ్చిన విరాళాలు చిన్పబోతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న అగ్ర హీరోలు కూడా కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నిర్మాతలు ఆయా హీరోలకు వాళ్లు అడిగినంత పారితోషకం ఇస్తున్నారు. వీళ్లు ఇంతింత పారితోషకాలు అందుకోవడానికి కారణం ప్రజలు. అలాంటి జనాలు ఇబ్బందుల్లో ఉన్నపుడు మిగతా అగ్ర హీరోలు కూడా అక్షయ్ కుమార్లా కనీసం రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు విరాళం ప్రకటిస్తే ఏమైవుతందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆయా హీరోలను ట్రోల్ చేస్తున్నారు. తెలుగు అగ్ర హీరోల్లో ప్రభాస్ మాత్రం ఉన్నంతలో రూ. 4.5 కోట్ల వరకు విరాళం ప్రకటించాడు. కానీ మిగతా హీరోలెవరు ఇంత భారీ ఎత్తున విరాళం ఎవరు ఇవ్వలేదు. అంతేకాదు ఆయా హీరోలు విరాళాలు ఇచ్చే విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించడం లేదని చాలా మంది నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
అక్షయ్ కుమార్ (Twitter/Photo)
ఇప్పటికే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.. ప్రధాన మంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు మన దేశంలోనే ఏ హీరో ఇవ్వలేనంతగా ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం ప్రకటించి మన పెద్ద మనసు చాటుకున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈయన ప్రశంసించడమే కాకుండా.. 25 కోట్ల రూపాయలను తన వంతుగా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. అక్షయ్ కుమార్ కూడా తాను ముంబైలో కేవలం రూ. 200 లతో అడుగుపెట్టాను. ఆకలితో ఎన్నో సార్లు పస్తులు కూడా ఉన్నాను. అలాంటి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ప్రజలు. అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడం నా ధర్మం అంటూ తన వినమ్రతను చాటుకున్నారు.కేవలం ప్రజలు ఇచ్చిన డబ్బునే వాళ్లు కష్టాల్లో ఉన్నపుడు తిరిగిచ్చేసానంటూ చెప్పుకొచ్చారు.
I salute @MumbaiPolice headconstables Chandrakant Pendurkar & Sandip Surve, who laid their lives fighting Corona. I have done my duty, I hope you will too. Let’s not forget we are safe and alive because of them 🙏🏻 https://t.co/mgJyxCdbOPpic.twitter.com/nDymEdeEtT
ఆ తర్వాత ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 3 కోట్ల భారీ విరాళం ప్రకటించి సంచలనం రేపాడు. ఈ విరాళంలో మున్సిపల్ కార్మికులకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం ఈ విరాళం అందజేయనున్నట్టు అక్షయ్ కుమార్ ప్రకటించారు. తాజాగా ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించి సంచలనం రేపాడు. మొత్తంగా ఈ విరాళంలతో కలిసి అక్షయ్ కుమార్.. మొత్తంగా రూ. 30 కోట్ల విరాళాన్నిఇవ్వడం నిజంగా గ్రేట్. గతంలో దేశ రక్షణలో భాగంగా పుల్వామా దాడితో పాటు మిగతా ఉగ్రదాడుల్లో చనిపోయిన సైనికుల కుటుంబాలకు రూ. కోట్లకు కోట్లు విరాళం అందజేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా తన సినిమాలతో పాటు తన విరాళాలతో అభినవ దాన కర్ణుడు అనిపించుకుంటున్నాడు అక్షయ్ కుమార్.