అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా బాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. అలా అని వెరైటీ సినిమాలే చేయడం లేదు..ఒకవైపు వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూనే...తనకు హీరోగా పేరు తీసుకొచ్చిన కామెడీ, యాక్షన్‌లను మాత్రం అసలు విడిచి పెట్టడం లేదు. ఈ ఏడాది అక్షయ్ కుమార్...‘ప్యాడ్‌మ్యాన్’, ‘గోల్డ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో మంచి సక్సెస్‌లను అందుకున్నాడు.
ప్రెజెంట్ ఈ బాలీవుడ్ ఖిలాడీ...19వ శతాబ్ధం జరిగిన ‘సారాగర్హి’ యుద్ధ నేపథ్యంలో ‘కేసరి’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు ‘హౌస్‌ఫుల్’ సిరిస్‌లో నాల్గో సీక్వెల్ ‘హౌస్‌ఫుల్ 4’ చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు ‘మిషన్ మంగళ్’, ‘గుడ్ న్యూస్’ సినిమాలను చేస్తున్నాడు.
రీసెంట్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మరోవైపు ‘భారతీయడు 2’ లో విలన్‌గా నటించేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
దక్షిణాది చిత్రాల్లో నటించడంతో పాటు సౌత్‌లో హిట్టైన ఎన్నో సినిమాలను బాలీవుడ్‌కు తీసుకెళ్లి మంచి సక్సెస్‌లను అందుకున్నాడు అక్షయ్. ఇప్పటికే సౌత్‌లో హిట్టైయిన ‘విక్రమార్కుడు’, ‘తుపాకీ’, ‘ఠాగూర్’ మూవీలను బాలీవుడ్‌లో ‘రౌడీ రాథోడో’, ‘హాలీడే’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’లుగా రీమేక్ చేసి మంచి సక్సెస్‌లను అందుకున్నాడు.
ఇపుడు మరోసారి సౌత్‌లో రాఘవ లారెన్స్ నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కాంచన’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హిందీలో ఈ మూవీని లారెన్స్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రీమేక్‌లో అజయ్ దేవ్‌గణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. మొత్తానికి సౌత్ రీమేక్‌లతో బాలీవుడ్‌లో రచ్చ చేసిన అక్షయ్..ఇపుడీ రీమేక్‌తో మరో సక్సెస్ అందుకుంటాడా లేదా చూడాలి.
బాలీవుడ్ హాట్ కపుల్స్
ఇవి కూడా చదవండి
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై టీడీపీ నేతల రచ్చ..హైకోర్టులో పిల్ దాఖలు..
ఆ విషయంలో ప్రభాస్‌ను బీట్ చేసిన కేజీఎఫ్ హీరో యశ్
నాగబాబు ఇంత చేస్తున్నా చిరంజీవి, పవన్ సైలెన్స్‌కు కారణమేంటి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Hindi Cinema, Lawrence