కియారా అద్వానీ బాటలో కమల్ హాసన్ కూతురు...

Akshara Haasan : శ్రుతీహాసన్‌ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుండగా.. రెండో కూతురు అక్షరహాసన్‌ గతంలో ధనుష్‌తో 'షమితాబ్‌' అనే  హిందీ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: August 8, 2019, 8:57 AM IST
కియారా అద్వానీ బాటలో కమల్ హాసన్ కూతురు...
కియారా అద్వానీ, అక్షర హాసన్ Photo : Instagram
  • Share this:

Akshara Haasan : కమలహాసన్‌ ...ఇద్దరు  కూతుళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు సినిమాల్లో నటిస్తూ అలరిస్తూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రుతీహాసన్‌ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుండగా.. రెండో కూతురు అక్షరహాసన్‌ గతంలో ధనుష్‌తో 'షమితాబ్‌' అనే  హిందీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అక్షర హాసన్ అలా తొలి చిత్రంలోనే అమితాబ్‌బచ్చన్, ధనుష్‌తో కలిసి నటించింది. అయితే ఆ సినిమా తన నటనకు మంచి మార్కులే పడ్డా.. ఆ తరువాత ఎక్కువ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించలేదు. అవకాశాలు రాకనా.. లేదా కథలు నచ్చకనో తెలియదు. ఆ తర్వాత.. ఆ మధ్య అజిత్‌ హీరోగా నటించిన వివేగం చిత్రంలో గెస్ట్‌గా మెరిసింది అక్షర.  ఇటీవల తండ్రి కమల్ హాసన్‌ నిర్మాణంలో విక్రమ్‌ హీరోగా వచ్చిన 'కడారం కొండాన్‌ '  అనే సినిమాలో నటించింది. అది అలా ఉంటే అక్షర సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ వెబ్ సీరిస్‌లో నటించేందుకు కూడా రెడీ అవుతోంది. కారణం.. ఈ వెబ్ సిరీస్‌కు సెన్సార్‌ సమస్యలు లేకపోవడంతో పాటు.. కథను ఎలాగైతే చూపించాలనుకుంటారో అలానే చూపించే ఆస్కారం ఉంటుంది. View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani) on

ఈ  నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటీమణులు ఈ వెబ్ సిరీస్ ల పైనే ఆధారపడుతూ తమలోని టాలెంట్ ని చూపించి స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్నారు. దానికి మంచి ఉదాహరణ "కబీర్ సింగ్" సినిమాతో బాలీవుడ్ లో పాపులర్ అయిపోయిన కియారా అద్వానీ. ఈ ముద్దుగుమ్మ కూడా మొదట ఒకటి రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది. ఆ వెబ్ సిరీస్ ఇచ్చిన కిక్‌తోనే సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని కూడా ఆ మధ్య చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలో కియారా మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభంలో చాల కష్టాలు పడ్డానని, 'ధోనీ' సినిమా త‌ర్వాత కూడా చాలా ఆడిష‌న్‌లలో పాల్గొన్నానని.. ఈ నేపథ్యంలో చాలా ఆఫీసుల చుట్టూ అవకాశాలకోసం తిరిగానని చెప్పింది. 'లస్ట్‌ స్టోరీస్‌' చేయ‌క‌పోతే చాలా న‌ష్ట‌పోయేదాన్ని అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

అలా కియారా బాటలోనే మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల్లో నటించనుంది అక్షరహాసన్‌. ఈ ముద్దుగుమ్మ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించబోతోందని తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ సెల్‌ఫోన్‌ ఇతి వృత్తంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ఇందులో నటి అక్షరహాసన్‌తో పాటు నటి సునైనా, గాయత్రి నటిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌  ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు 'అరిందుమ్‌ అరియామలుమ్', 'ఆరంభం', 'బిల్లా' వంటి తమిళ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన 'పంజా 'కు కూడా ఈయనే దర్శకుడు. మరీ ఈ వెబ్ సిరీస్‌తో  అక్షర హాసన్ కెరీర్‌ ఏమాత్రం ఊపందుకుంటుందో చూడాలి.
First published: August 8, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading