భర్తకు ప్రేమతో.. నాగ చైతన్యకు సమంత పెళ్లిరోజు కానుక..

టాలీవుడ్‌‌లో ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నాగ చైతన్య, సమంత. ఈ రోజు వీళ్లిద్దరు రెండో పెళ్లి వేడకను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 8:01 PM IST
భర్తకు ప్రేమతో.. నాగ చైతన్యకు సమంత పెళ్లిరోజు కానుక..
అక్కినేని నాగ చైతన్య,సమంత (Instagram/Photo)
  • Share this:
టాలీవుడ్‌‌లో ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నాగ చైతన్య, సమంత. పెళ్లి ముందు కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగి ఈ ఆదివారానికి రెండేళ్లు.  ఈ సందర్భంగా సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫోటోలతో పాటు వివిధ సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో పాటు చైతూతో కలిసి డాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది సమంత. ఈ రెండేళ్లు ఎలా గడిచిపోయాయే తెలియడం లేదు. ఈ రెండేళ్లలో మా మధ్య ప్రేమ మరింత బలపడింది. రెండేళ్ల వివాహా వార్షికోత్సవం.. పదేళ్ల ప్రేమకత. నీ ప్రేమకు బందీనయ్య చైతన్య అని సమంత భావోద్వేగంతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీరి రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసారు. వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మహేష్ బాబు భార్య నమ్రత, కాజల్, త్రిష, హన్సిక,రానా, లావణ్య త్రిపాఠి, కోన వెంకట్,అల్లు స్నేహారెడ్డితో నందిని రెడ్డి ఉన్నారు. మొత్తంగా రెండో పెళ్లి రోజున సామ్, చైతూలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
First published: October 6, 2019, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading