Naga chaithanya - Samantha: టాలీవుడ్ లో మంచి క్రేజీ కపుల్ ఎవరు అంటే నాగచైతన్య, సమంత జంటల గురించి చెప్పేస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే సినిమాలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు వీరు. ఇక ఆతర్వాత మనం, మజిలీ సినిమాలోను కలిసి నటి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమాల్లో నటిస్తూనే ప్రేమించుకున్న ఈ జంట 2017లో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వీరిద్దరూ జంటగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అంతేకాకుండా సమంత ఇంట్లో ఉండే విధానంపై నాగ చైతన్య చాలాసార్లు ఫన్ కూడా చేశాడు. ఆహా యాప్ లో సమంత సామ్ జామ్ అనే రియాల్టీ షోకు హోస్ట్ గా చెయ్యగా ఆ సమయంలో నాగచైతన్యను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఎపిసోడ్ లో సమంత అడిగిన ప్రశ్నలకు నాగ చైతన్య చెప్పిన సమాధానాలు అందరిని షాక్ కి గురి చేసాయ్ కూడా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటించగా.. ప్రస్తుతం మరో సినిమాలో బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. అందులో చైతు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో పూర్తయింది. ఇక ఈ విషయాన్ని రాశి ఖన్నా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. చైతన్యతో కలసి తీసుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారగా.. ఈ ఫోటోపై మీమర్స్ భారీ జోకులు వేస్తున్నారు. అందులో చైతు, రాశి చనువుగా తీసుకున్న ఫోటోను సమంత చూస్తున్నట్టు ఎడిట్ చేసి.. 'పక్కకి జరుగు రాశి' అని సమంత అంటున్నట్టు ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సమంత అది కేవలం సినిమా.. నాగ చైతన్యపై అంత సీరియస్ అవ్వకు అమ్మ అంటూ నెటిజెన్ల సలహాలు కూడా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni samantha, Love story, Naga chaithanya, Rashi khanna, Sai Pallavi, Shekar kammula, టాలీవుడ్, నాగచైతన్య, సమంత