హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్.. చెయ్యి మొత్తం పచ్చబొట్లు.. సామ్ ఏం చేసిందంటే?

Samantha Akkineni: సమంత నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్.. చెయ్యి మొత్తం పచ్చబొట్లు.. సామ్ ఏం చేసిందంటే?

Samantha (file)

Samantha (file)

Samantha Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చలామణిలో ఉన్నటువంటి అక్కినేని సమంత దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మెన్ అనే సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  Samantha Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చలామణిలో ఉన్నటువంటి అక్కినేని సమంత దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మెన్ అనే సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సమంతకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిలో కొందరు అభిమానించే వారు కాగా, మరికొందరు ఈ హీరోయిన్ ను ప్రేమించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే ఈ కుర్రాడని చెప్పవచ్చు. తనకు సమంత అంటే ఇష్టమేకాక ప్రేమ కూడా ఉండడంతో ఏకంగా సామ్ పేరును చేతిపై టాటూ వేయించుకుని, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమంతకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

  పవన్ సమ్ము అనే పేరుతో కుర్రాడు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో తనకు సమంత అంటే ఎంతో ఇష్టమని.. తెలుపుతూ తన చేతి పై ఉన్నటువంటి సమ్ము అనే టాటూ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వే సమ్ము.. నీపై ఉన్న ప్రేమ అనంతం.. ఇప్పుడు నా ప్రేమ.. నా టాటూ శాశ్వతం అంటూ" రాసుకోస్తూ సమంతకు టాగ్ చేశాడు.

  ఇది కూడా చదవండి:చరణ్, సమంతల మధ్య లిప్ లాక్ వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

  ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ట్వీట్ కి సమంత రీ-ట్వీట్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే సమంత సదరు అభిమాని ట్వీట్ కి రీ ట్వీట్ చేస్తూ.. షాకింగ్ ఎమోజీలను జతచేసి ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇది కూడా చదవండి:సమంత, కాజల్‌లకు పోటీగా రష్మిక మందన.. మరీ ఇంత స్పీడా?

  ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా సమంత పోస్టుపై తమదైన శైలిలో స్పందిస్తూ.. మిగతా అభిమానులు కూడా సమంత అంటే వారికి ఉండే ఇష్టాన్ని.. అభిమానాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి పవన్ అనే అభిమాని సమంత పై ప్రేమను ఈ విధంగా చూపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Samantha akkineni, Samantha tattoos, Samantha twitter, Social Media, Tollywood

  ఉత్తమ కథలు