Samantha: సమంత చేసిన పనికి అవాక్కవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ..

అవును సమంత చేసిన పనికి ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 28, 2019, 3:23 PM IST
Samantha: సమంత చేసిన పనికి అవాక్కవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ..
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
news18-telugu
Updated: July 28, 2019, 3:23 PM IST
అవును సమంత చేసిన పనికి ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగులో  హీరోయిన్‌గా అక్కినేని కోడలు దూకుడు మాములుగా లేదు. ఒకప్పుడు హీరోల సరసన ఆడిపాడటానికే పరిమితం అయ్యే సమంత.. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి సారించింది. గతేడాది ‘యూటర్న్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సమంత.. అ ఇయర్ మాత్రం తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబి’తో మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాల తర్వాత సమంత తన పారితోషకాన్ని అమాంతం పెంచేసినట్టు సమాచారం.దీంతో సమంతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలు ఇపుడు ఆమె చెబుతున్న పారితోషకం విని షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ. 2కోట్లు తీసుకున్న సమంత.. తాజాగా తన పారితోషకాన్ని కోటి పెంచి రూ. 3 మూడు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో సమంతతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలు ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోవడం చూసి ఇండస్ట్రీ జనాలు అవాక్కవతున్నారు. 

Samantha Akkineni turns producer with her Husband Naga Chaitanya for Nandini Reddy movie pk.. ఓ బేబీతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ర్లేద‌నిపిస్తుంది స‌మంత అక్కినేని. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లో ఇప్పుడు మ‌రో సాహ‌సం చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. naga chaitanya,naga chaitanya twitter,samantha twitter,samantha producer,samantha naga chaitanya,samantha,naga chaitanya and samantha,naga chaitanya about samantha,naga chaitanya samantha movie,naga chaitanya samantha new movie,samantha akkineni,naga chaitanya and samantha love story,naga chaitanya movies,naga chaitanya samantha,samantha movies,naga chaitanya wife samantha,naga chaitanya and samantha movies,naga chaitanya samantha funny unseen,telugu cinema,samantha nandini reddy,oh baby movie,oh baby movie collections,సమంత,సమంత అక్కినేని,సమంత నాగచైతన్య,సమంత నిర్మాత,సమంత నందిని రెడ్డి,తెలుగు సినిమా,ఓ బేబీ కలెక్షన్స్
‘ఓ బేబీ’ మూవీ


ఇక రెమ్యూనరేషన్ విషయంలో సౌత్‌లో ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటూ నయనతార టాప్‌లో ఉంది. ఆమె కూడా ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే..మరోవైపు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఈ రేంజ్‌కు చేరుకుంది. ఇపుడు నయనతార తర్వాత సెకండ్ ప్లేస్‌లో సమంత ఉండటం విశేషం.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...