హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత ఇల్లు చూశారా? ఇంద్రభవనంలా ఉందిగా!

Samantha Akkineni: సమంత ఇల్లు చూశారా? ఇంద్రభవనంలా ఉందిగా!

Samantha Akkineni

Samantha Akkineni

Samantha Akkineni: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

Samantha Akkineni: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అంతేకాకుండా నాగర్జున కోడలిగా కూడా మరో గుర్తింపు అందుకుంది. ఎన్నో సినిమాల్లో నటించి వెను దిరగకుండా వరుస సినిమాలతో స్టార్ రేంజ్ కు ఎదిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సామ్.

ఇక ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శకుంతల పాత్రలో నటిస్తున్న సామ్.. ప్రస్తుతం ఈ ఒక్క సినిమాలోనే నటిస్తుందది. అంతే కాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే సమంత ఇంట్లో ఉన్నప్పుడు తన సమయాన్ని చైతన్యతో కంటే గార్డెనింగ్ తో, తన డాగ్ తో ఎక్కువగా గడుపుతుంది. ఈ విషయాన్ని పలు ఇంటర్వూస్ లలో తెలిపింది.ఇదిలా ఉంటే సమంత ఇల్లు ను కూడా చాలా సార్లు తన గార్డెనింగ్ సమయంలో చూపిస్తూనే ఉంటుంది.

https://www.youtube.com/watch?v=yR8dS7mNLYM

ప్రస్తుతం సమంత తన గార్డెనింగ్, డాగ్ తో గడుపుతున్న సమయంలో తన ఇల్లు ని కూడా చూపించింది. అంతే కాకుండా సమంత కిచెన్ లో కూడా వంట చేస్తున్న దృశ్యాన్ని కూడా చూడవచ్చును. మామూలుగా సమంతకు ఇంట్లోనే కూరగాయలు పెంచుకునే అలవాటు ఎక్కువగా ఉంది. దాంతో తాను ఇంట్లోనే రకరకాల కూరగాయలను పండిస్తూ సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటుంది. తన సొంతంగానే మొక్కలకు కావలసిన పదార్థాలు తయారు చేసి స్వయంగా తానే పెంచుకుంటుంది. అంతే కాకుండా ఇంట్లో ఏకంగా కాస్త స్థలాన్ని గార్డెనింగ్ కోసం ఏర్పాటు చేసుకుంది.ఇక తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ అందులో చూడవచ్చు.

First published:

Tags: Akkineni nagarjuna, Nagachaithanya, Samantha akkineni, Samantha dog, Samantha plants, Social Media, Viral Video, సమంత ఇల్లు

ఉత్తమ కథలు