మామ నాగార్జున బాటలో సమంత.. నిజంగానే సామ్ ఆ పని చేయబోతుందా..

అవును సమంత అక్కినేని కోడలు అయ్యాకా పూర్తిగా మారిపోయింది. మారిపోయింది అంటే ఇంటి పేరుతో సహా తన ఇష్టాయిష్టాలను పూర్తిగా మార్చుకుంది. తాజాగా ఈమె నాగార్జున బాటలో..

news18-telugu
Updated: June 26, 2020, 2:49 PM IST
మామ నాగార్జున బాటలో సమంత.. నిజంగానే సామ్ ఆ పని చేయబోతుందా..
నాగార్జున సమంత
  • Share this:
అవును సమంత అక్కినేని కోడలు అయ్యాకా పూర్తిగా మారిపోయింది. మారిపోయింది అంటే ఇంటి పేరుతో సహా తన ఇష్టాయిష్టాలను పూర్తిగా మార్చుకుంది. అంతేకాదు పెళ్లి తర్వాత తనదైన శైలిలో కథానాయికగా సత్తా చూపెడుతోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సమంత.. ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు..కుక్కతో ఆడుకుంటోంది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. అంతేకాదు ఇంట్లోనే సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. తాజాగా ఈమె తన మామయ్య నాగార్జున బాటలో మరో అడుగు వేయబోతున్నట్టు సమాచారం. అది కూడా బిగ్‌బాస్ 4 తెలుగు హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించడానికి రెడీ అయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌కు హీరోలే యాంకరింగ్ చేస్తూ వచ్చారు. తెలుగు విషయానికొస్తే.. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

అవును సమంత అక్కినేని కోడలు అయ్యాకా పూర్తిగా మారిపోయింది. మారిపోయింది అంటే ఇంటి పేరుతో సహా తన ఇష్టాయిష్టాలను పూర్తిగా మార్చుకుంది.
బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా సమంత (File/Photos)


తాజాగా నాల్గో సీజన్ కోసం హీరోల కోసం ప్రయత్నించినా.. అందరు తమ తమ సినిమాలతో బిజీగా ఉండటం మూలానా.. ఈసారి స్టార్ మా.. వెరైటీగా హీరోయిన్‌తో ఈ ప్రోగ్రామ్‌ను చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట. గతంలో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ హౌస్‌లో రమ్యకృష్ణ ఒకటి రెండు రోజులు హోస్ట్‌గా వ్యవహరించింది. అలా ఏదో గెస్ట్ పాత్రలో మెప్పించిందే తప్ప.. పూర్తి స్థాయిలో ఏ హీరోయిన్‌ యాంకర్‌గా వ్యవహరించలేదు. ఇపుడు సమంత ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్ చేయడానికి అంగీకరిస్తే.. ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌ను  హోస్ట్ చేసే తొలి హీరోయిన్ అవుతోంది. ఈ ప్రోగ్రామ్ చేయడానికి సమంతకు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట స్టార్ మా. మరోవైపు స్టార్ మా కూడా నాగార్జున సలహాతో సమంతను ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేయమని స్టార్ మా వాళ్లు సమంతను సంప్రదించారట. అంతేకాదు సమంత ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసేది లేనిది మాత్రం ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడట.  మరి అక్కినేని కోడులు బిగ్‌బాస్ 4 సీజన్‌కు హోస్ట్‌గా ఉండటానికి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.
First published: June 26, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading