Akkineni : గీతా ఆర్ట్స్‌లో తాత అక్కినేనికి దక్కని హిట్.. మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అందుకున్నారుగా..

అక్కినేని హీరోలకు కలిసొచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ (File/Photos)

Akkineni Nageswara Rao - Allu Aravind Geetha Arts : గీతా ఆర్ట్స్‌లో తాత అక్కినేని దక్కని హిట్.. మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అందుకున్నారుగా.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Akkineni : గీతా ఆర్ట్స్‌లో తాత అక్కినేని దక్కని హిట్.. మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అందుకున్నారుగా.. వివరాల్లోకి వెళితే.. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ కేవలం మెగా హీరోలతోనే కాదు.. అక్కినేని హీరోలతో పాటు మిగతా కథానాయకులతో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో తాజాగా అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్ హీరోగా నటించిన నాల్గో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బిగ్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేసి లాభాల్లోకి ప్రవేశించింది. గత ఆరేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూసిన అఖిల్‌కు ఈ సినిమాతో సక్సెస్ అంటే చూసారు.

    అంతకు ముందు నాగ చైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తమన్నా కథానాయికగా అల్లు అరవింద్ నిర్మించిన ‘100 % లవ్’ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ రకంగా అక్కినేని బ్రదర్స్ అయిన నాగ చైతన్యకు, అక్కినేని అఖిల్‌కు అల్లు అరవింద్ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌లో సక్సెస్ అందుకున్నారు. ఈ రకంగా అక్కినేని హీరోలకు గీతా ఆర్ట్స్ బాగానే కలిసొచ్చింది. కానీ నాగ చైతన్య, అఖిల్ తాత గారైన లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రం ఈ బ్యానర్ చేదు జ్జాపకాన్ని మిగిల్చింది.

    Mukku Avinash : ముక్కు అవినాష్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఫోటోస్ వైరల్..

    అక్కినేని నాగేశ్వరరావు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి హీరోగా నటించిన ‘మెకానిక్ అల్లుడు’ సినిమా చేశారు. బి.గోపాల్ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఏఎన్నార్, చిరంజీవి మామ అల్లుళ్లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరంగనీతులు’ సినిమానే కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు.

    Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    కానీ ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమాగా ఇరువురు హీరోల అభిమానులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఈ ఇరువురు హీరోలు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్, అక్కినేని నాగేశ్వరరావు కూతురు తనయుడు సుశాంత్ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    మొత్తంగా అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావు తప్ప.. వాళ్ల మనవళ్లు ఇద్దరు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌లు ఈ బ్యానర్‌లో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అఖిల్ విషయానికొస్తే.. కెరీర్‌లోనే తొలి సక్సెస్ ఎలా ఉంటుందో రుచి చూసాడు. ఈ సినిమా తర్వాత అఖిల్.. ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మొత్తంగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌ అక్కినేని హీరోలకు బాగానే కలిసొచ్చింది
    Published by:Kiran Kumar Thanjavur
    First published: