హోమ్ /వార్తలు /సినిమా /

నాగార్జున మన్మథుడు 2లో రకుల్, సమంతతో పాటు మరో పాపులర్ హీరోయిన్

నాగార్జున మన్మథుడు 2లో రకుల్, సమంతతో పాటు మరో పాపులర్ హీరోయిన్

రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని

రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని

అక్కినేని నాగార్జున తాజా సినిమా ‘మన్మథుడు 2’లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది.

  అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన పోయిన సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. దాదాపు 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్‌లోనే అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా ఇప్ప‌టికీ టీవీల్లో వస్తుందంటే..అలానే అతుక్కుపోయే చూసే వాళ్లున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2 వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాను మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నాగార్జున, పి.కిరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జునకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా మొత్తం పోర్చుగల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పోర్చుగల్‌లో షూటింగ్ ముగించుకున్న చిత్ర బ‌ృదం.. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నది. అందులో భాగంగా ఆమె తన పార్ట్‌కు సంబందించిన షూటింగ్‌ను ముగించుకుని, భర్త నాగ చైతన్యతో స్పెయిన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.


  కీర్తి సురేష్
  కీర్తి సురేష్


   


  అయితే తాజాగా ఈ సినిమాలో మరో నటి కూడా నటించనున్నదని తెలుస్తోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పెషల్‌గా కీర్తి సురేష్ కోసం ఓ పాత్రని రాశాడట. ఆయన రాసిన తీరు, పాత్ర కూడ కీర్తికి నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇజ్రాయిల్ షెడ్యూల్ పూర్తైన తర్వాత.. హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నతాజా షెడ్యూల్‌లో నాగార్జున, కీర్తి సురేష్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు రాహుల్. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో లక్ష్మి,వెన్నెల కిషోర్,రావు రమేష్,నాజర్,ఝాన్సీ నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

  First published:

  Tags: Bollywood news, Hindi Cinema, Keerthi Suresh, Keerthy Suresh, Nagarjuna, Nagarjuna Akkineni, Rahul Ravindran, Rakul, Rakul Preet Singh, Samantha, Tamil Film News, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema, Tollywood news

  ఉత్తమ కథలు