Manmadhudu 2: నాగార్జున ‘మన్మథుడు 2’ సెన్సార్ పూర్తి..

నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన్మథుడు 2’. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ వాల్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.

news18-telugu
Updated: August 6, 2019, 4:26 PM IST
Manmadhudu 2: నాగార్జున ‘మన్మథుడు 2’ సెన్సార్ పూర్తి..
మన్మథుడు 2 సెన్సార్ పూర్తి
news18-telugu
Updated: August 6, 2019, 4:26 PM IST
నాగార్జున హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘మన్మథుడు 2’. అపుడెపుడే పదిహేడేళ్ల క్రితం విజయ్ భాష్కర్ దర్శకత్వంలో త్రవిక్రమ్ పెన్ను పవర్‌తో తెరకెక్కిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాలో ‘మన్మథుడు’లో హిల్లేరియస్‌ కామెడీతో తెరకెక్కించినట్టు ఈ సినిమా ప్రోమోస్‌ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు లేటు వయసులో మూడు లిప్‌లాక్‌లతో కింగ్ అదరగొట్టేసాడు.

akkineni nagarjunas manmadhudu 2 censor completed go ua certificate,manmadhudu 2 censor completed,manmadhudu 2 censor completed by u by a,u a certificate issue by censor board to manmadhudu 2,nagarjuna,nagarjuna akkineni,nagarjuna manmadhudu 2,tollywood,telugu cinema,నాగార్జున,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు 2 సెన్సార్ పూర్తి,యూ ఏ సర్టిఫికేట్ నాగార్జున,నాగార్జున యూఏ సర్టిఫికేట్ జారీ,
‘మన్మథుడు 2’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)


ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్, రావు రమేష్, లక్ష్మీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి మోడ్రన్ మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేసేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి టూ మచ్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ సినిమా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు కనబడుతుంది. ఏమైనా అప్పట్లో మన్మథుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. ఇపుడు అదే రేంజ్‌లో ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...