• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AKKINENI NAGARJUNA WRAPED UP HIS PORTION IN BRAHMASTRA MOVIE MHN

Akkineni Nagarjuna - Brahmastra: ప్యాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన నాగ్‌.. ఫొటోలు వైరల్‌

Akkineni Nagarjuna - Brahmastra: ప్యాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన నాగ్‌.. ఫొటోలు వైరల్‌

Akkineni Nagarjuna wraped up his portion in Brahmastra movie

Akkineni Nagarjuna - Brahmastra: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున నటిస్తోన్న ప్యాన్‌ ఇండియా మూవీ బ్రహ్మస్త్రలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు ట్వీట్‌ చేశాడు

  • Share this:
    కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినప్పుడు హీరోలు షూటింగ్స్‌ స్టార్ట్‌ చేయడానికి తటపటాయిస్తుంటే అక్కినేని నాగార్జున ధైర్యంగా ముందడుగు వేశారు. ఆయన బిగ్‌బాస్‌ చిత్రీకరణలో పాల్గొనడమే కాదు.. తన యాక్షన్‌ మూవీ వైల్డ్‌డాగ్‌ను కూడా పూర్తి చేసేశాడు. ఈ టాలీవుడ్‌ మన్మథుడు బాటలోనే తర్వాత హీరోలు ట్రావెల్‌ చేశారు. అదే ఊపుతో నాగార్జున ఇప్పుడు ప్యాన్‌ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రను పూర్తి చేసేసుకున్నాడు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిత్రీకరణను తాను పూర్తి చేసుకున్నానని తెలియజేస్తూ నాగార్జున ట్వీట్‌ చేయడం విశేషం. రణ్‌భీర్ కపూర్‌, ఆలియా భట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు నాగార్జున. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన ప్రపంచాన్ని మీరు చూస్తారు. నేను కూడా ఆసక్తిగా అందుకోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు నాగార్జున. అయాన్ ముఖర్జీ, రణ్‌భీర్‌ కపూర్‌, ఆలియా భట్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు నాగార్జున. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

    ఈ సినిమాలో నాగార్జున ఓ సైంటిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో నాగార్జున పదిహేను నిమిషాల పాటు కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయడానికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కలిస్తే.. నాగార్జున తనకు పాత్రను త్రీడీ వెర్షన్‌లో వివరిస్తేనే ఆలోచిస్తానని చెప్పాడట. అప్పుడు అయాన్‌ ముఖర్జీ ..నాగ్‌ చెప్పినట్లే ఆయన పాత్రను త్రీడీ వెర్షన్‌లో డిజైన్‌ చేసి వివరించాడట. అప్పుడు నాగ్‌ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని నాగార్జునే చెప్పడం విశేషం. పద్దెనిమిదేళ్ల తర్వాత నాగార్జున నటిస్తోన్న హిందీ చిత్రమిది.


    ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్న తరుణంలో బాలీవుడ్‌ సినిమా బ్రహ్మాస్త్ర .. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్రను పోషించారు. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్ర రూపొందుతోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇది మూడు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి పార్ట్‌ ఈ ఏడాది చివరల్లో బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. సైన్స్‌, దైవం మధ్య ఉన్న అంశాలను వివరించేలా ఈ సినిమాను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు