హోమ్ /వార్తలు /సినిమా /

The Ghost Trailer: ఒక్కణ్ణి కూడా వదలను.. నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్

The Ghost Trailer: ఒక్కణ్ణి కూడా వదలను.. నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్

Nagarjuna The Ghost News 18

Nagarjuna The Ghost News 18

Akkineni Nagarjuna: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు నాగార్జున. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తి పెంచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కుర్ర హీరోలకు ధీటుగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ఈ క్రమంలో ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ది ఘోస్ట్ (The Ghost) అనే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు బెస్ట్ ప్రమోషన్స్ అందిస్తున్న యూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రత్యర్ధుల్ని ఊచకోత కోసే సీన్ తో మొదలైన ఈ వీడియో ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. చిత్రంలోని యాక్షన్ సీన్స్ చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. చావును చాలా సార్లు చాలా దగ్గరగా చూసాను ప్రియ అనే డైలాగ్ ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఎంత బలంగా ఉండనుండో స్పష్టం చేస్తోంది. ఇట్ నెవర్ స్టాప్స్.. ఒక్కణ్ణి కూడా వదలను అంటూ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుండటం సినిమా రేంజ్ తెలుపుతోంది. ఆకట్టుకునే సీన్స్, పదునైన డైలాగ్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.


గతంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ (The Ghost Glimps) సినిమాపై ఆసక్తి పెంచగా.. తాజాగా వదిలిన ట్రైలర్ ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉండనున్నాయో స్పష్టం చేశాయి. డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫింగ్ పై ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.


శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమపార్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


'ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి అని నాగార్జున అన్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Akkineni nagarjuna, Praveen Sattaru, The Ghost Movie

ఉత్తమ కథలు