Home /News /movies /

AKKINENI NAGARJUNA THE GHOST GLIMPS RELEASE SLB

The Ghost Glimps: నాగార్జున ది గోస్ట్ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్ ప్యాక్డ్ వీడియో

photo twitter

photo twitter

Akkineni Nagarjuna The Ghost: అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్ ' చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు.

ఇంకా చదవండి ...
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 'ది ఘోస్ట్' (The Ghost) చిత్రం ప్రమోషన్స్ 'కిల్లింగ్ మెషిన్'తో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో (The Ghost Glimps) నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది. ఈ వీడియో 'ది ఘోస్ట్' సినిమాపై ఉన్న అంచనాలు పెంచింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది.

దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ పాల్గొన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. 'ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. సునీల్ నారంగ్ గారి నాన్న గారు నారాయణ్ దాస్ నారంగ్‌తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైయింది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. నాగార్జున గారితో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నాగార్జున గారు స్టైలిష్ యాక్షన్‌లో అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది. సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సునీల్ నారంగ్, , పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారు గొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు. టెక్నికల్ టీం, డైరెక్షన్ టీమ్‌కి కృతజ్ఞతలు'' అని అన్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Akkineni nagarjuna, Tollywood, Tollywood actor

తదుపరి వార్తలు