హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna: అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'మాధవే మధుసూదనా' ఫస్ట్ లుక్ రిలీజ్

Nagarjuna: అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'మాధవే మధుసూదనా' ఫస్ట్ లుక్ రిలీజ్

Madhave Madhusudana First Look

Madhave Madhusudana First Look

Madhave Madhusudana First Look: బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా 'మాధవే మధుసూదనా' మూవీ తెరకెక్కుతోంది. తాజాగా అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం చిత్రసీమలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుండటం చూస్తున్నాం. స్టార్ హీరో హీరోయిన్లతో పాటు బడా దర్శక నిర్మాతలు సైతం చిన్న సినిమాలకు తమ వంతు సహకారం అందిస్తూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే బాటలో తాజాగా మాధవే మధుసూదనా సినిమా కోసం అక్కినేని నాగార్జున (Nagarjuna) ముందుకొచ్చారు.

బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా 'మాధవే మధుసూదనా' మూవీ తెరకెక్కుతోంది. బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో ప్రొడక్షన్ నెంబర్ 2 గా రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచేశారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను (Madhave Madhusudana First Look) మేకర్లు రిలీజ్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు మేకర్స్. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బాగుందని, అందరినీ మెప్పించేలా ఉందని చెబుతూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ మోషన్ పోస్టర్‌లో సంగీతం, ఆర్ఆర్ వినసొంపుగా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరపై ఆవిష్కరించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ అవ్వనున్నట్టుగా కనిపిస్తోంది. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, శైలజా ప్రియ, మెకా రామకృష్ణ, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీ లత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First published:

Tags: Akkineni nagarjuna, Cinema, Tollywood

ఉత్తమ కథలు