#Manmadhudu2Teaser: నాగార్జున ఇంకా వర్జిన్ అంట.. ముదురు మన్మథుడి పెళ్లిగోల..

మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను కాసేటి క్రితమే విడుదల చేసారు.

news18-telugu
Updated: June 13, 2019, 1:30 PM IST
#Manmadhudu2Teaser: నాగార్జున ఇంకా వర్జిన్ అంట.. ముదురు మన్మథుడి పెళ్లిగోల..
మన్మథుడు 2లో నాగార్జున
  • Share this:
మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. విజయ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభకు త్రివిక్రమ్ మాటలు తోడై ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది కూడా అందుకుంది. అలాంటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా రాహుల్ రవీంద్రన్ నాగార్జున హీరోగా ‘మన్మథుడు 2’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను  విడుదల చేసారు.


ఈ టీజర్‌ చూస్తుంటే ఈ వయసులో నాగార్జున ఈ రేంజ్‌లో రొమాన్స్ చేస్తాడని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. నీకు షటర్లు మూసేసి దుకాణం సద్దేసే చేసే టైమ్ వచ్చేసింది.  ఇంత అందంగా పుట్టి ఏం ప్రయేజనం ఉండదుగా అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ మొలుస్తాందా అని వెన్నెల కిషోర్ చెప్పిన  డైలాగులు బాగున్నాయి. మరోవైపు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి అంటూ నాగార్జున ఈ సినిమాలో తను పెద్ద ఏజ్ అన్న వాడిని చెప్పుకోవడం అభినందిచాల్సిన విషయం. మరోవైపు నీవు వర్జినా అంటే ఔను అంటూ నాగార్జున చెప్పడం... అదే సమయంలో  నాగార్జున సహా ముగ్గురు భామలతో లిప్‌లాక్ సీన్స్‌లో యాక్ట్ చేసిన సీన్స్‌ను పెట్టి పెద్ద సాహసం చేసాడనే చెప్పాలి. అంతేకాదు పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో ఇపుడు బ్యాటింగ్ ఏంట్రా అంటూ రావు రమేష్‌తో చెప్పిన డైలాగులు సెకండ్ లెవల్‌లో ఉన్నాయి. ఈ రకంగా టీజర్‌తో ‘మన్మథుడు 2’లో డైలాగులు డబుల్ మీనింగ్‌లో ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి ముదురు వయసు మన్మథుడుగా నాగార్జున పిల్ల కోసం పడే తిప్పలు కామెడీని తెప్పించాయి. చివర్లో ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్ అంటూ నాగార్జున చివర్లో డైలాగు చెబుతూ తన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పించడం బాగుంది.

Akkineni Nagarjuna Manmadhudu 2 Teaser Talk,#Manmadhudu2Teaser,manmadhudu 2 teaser,manmadhudu 2 teaser talk,nagarjuna manmadhudu 2 teaser,akkineni nagarjuna manmadhudu 2 teaser talk,nagarjuna twitter,nagarjuna instagram,akkineni nagarjuna facebook,manmadhudu 2,manmadhudu 2 movie,nagarjuna twitter,nagarjuna instagram,keerthy suresh twitter,keerthy suresh instagram,nagarjuna manmadhudu 2,manmadhudu 2 teaser,manmadhudu 2 trailer,nagarjuna manmadhudu 2 movie,manmadhudu 2 first look,keerthy suresh,keerthi suresh,manmadhudu 2 movie songs,nagarjuna,manmadhudu 2 nagarjuna,manmadhudu 2 movie opening,manmadhudu 2 movie updates,nagarjuna movies,rahul ravindran got nagarjuna manmadhudu 2 movie chance,rahul ravindran manmadhudu 2 movie,tollywood,telugu cinema,andhra pradesh news,andhra pradesh politcis,మన్మథుడు 2 టీజర్ టాక్,మన్మథుడు టీజర్,మన్మథుడు,మన్మథుడు 2,మన్మథుడు సీక్వెల్,నాగార్జున కీర్తి సురేష్,నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్,నాగార్జున మన్మథుడు 2,కీర్తి సురేష్,నాగార్జున కీర్తి సురేష్,నాగార్జున కీర్తి సురేష్ మన్మథుడు 2,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
మన్మథుడు 2 లో నటిస్తోన్న నటీనటులు


ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తోంది. మరోవైపు ‘మన్మథుడు’ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో అన్షు అగర్వాల్ పాత్రలాగా ఈ  సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్, రావు రమేష్, లక్ష్మీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి మోడ్రన్ మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేసేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి టూ మచ్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా చూసేలా మాత్రం లేదు. అప్పట్లో మన్మథుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. ఇపుడు అదే రేంజ్‌లో ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading