Akkineni Nagarjuna doing high action sequences with Bangkok fighters for Praveen Sattaru movie
Akkineni Nagarjuna: టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకడైన నాగార్జున తాజా చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ కింగ్ నాగార్జున బ్యాంకాక్ వాళ్లతో గొడవ పడుతున్నాడా.. ఎందుకు? అసలు వాళ్లతో నాగార్జునకి గొడవ పడాల్సినంత అవసరం ఏముంది? అని అనుకోకండి. నాగార్జున పడుతున్న గొడవంతా తన సినిమా కోసమే. ఇంతకీ ఆ సినిమా గొడవేంటంటే..!. ప్రస్తుతం నాగార్జున తన లేటెస్ట్ మూవీని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాగార్జున చాలానే కష్టపడుతున్నాడట. చకచకా సినిమాను పూర్తి చేయడంలో తన వంతుగా సపోర్ట్ చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో స్పెషల్ సెట్‌ను వేశారు. రెండు రోజుల పాటు ఇక్కడే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రవీణ్ సత్తారు పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ చేయడం వల్ల అనుకున్న సమయం కంటే ముందుగానే షూటింగ్‌ను పూర్తి చేసేశారట. ప్రవీణ్ స్పీడు చూసి నాగార్జున షాక్ అయ్యాడట. ఈ సంగతిని పక్కన పెడితే, ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్ నుంచి స్పెషల్‌గా ఫైట్ మాస్టర్స్‌ను రప్పించాడట ప్రవీణ్ సత్తారు. ఇప్పటి వరకు నాగార్జునను చూడనటువంటి కొత్త లుక్‌లో, సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించనున్నాడట. ఈ సినిమాలో నాగార్జున రిటైర్డ్ రా ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గోవాలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది.
కోవిడ్ ప్రభావంలో వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేసిన నాగార్జున, బిగ్‌బాస్ సీజన్ 4ను కూడా పూర్తి చేశాడు. ఎక్కువ గ్యాప్ తీసుకుకోకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసే పనిలోఉన్నాడు నాగ్.