నాగార్జున అక్కినేని (nagarjuna)
అవును..టాలీవుడ్ హీరో నాగార్జునకు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. ఉదాహరణకు ఎన్టీఆర్ సరసన నటించిన జయసుధ, రతి అగ్నిహోత్రి,రాధలు కొడుకు బాలకృష్ణ సరసన నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వర రావు సరసన నటించిన శ్రీదేవి, రాధలతో ఆయన తనయుడైన నాగార్జునకు జోడిగా నటించారు.

ఏఎన్నాఆర్,నాగార్జున సరసన నటించిన శ్రీదేవి
ఇక నాగార్జున విషయానికొస్తే..తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు కొడుకు నాగ చైతన్యకు జోడిగా నటించిన లావణ్య త్రిపాఠితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేసాడు. అంతేకాదు చైతూ సరసన ‘రారండోయ్ వేడుక చేద్దాం’ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఇపుడు ‘మన్మథుడు’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘మన్మథుడు 2’ లో కలిసి నటించారు.

మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్
ఈ రకంగా అటు తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు..ఇటు తనయుడు నాగ చైతన్యకు జోడిగా నటించిన భామలతో సిల్వర్ స్క్రీన్‌పై జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు.

రకల్ ప్రీత్ సింగ్ నాగచైతన్య
ఇక నాగార్జున తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలు ఈ రికార్డు అందుకోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సరసన నటించిన భామతో బాలయ్య యాక్ట్ చేస్తే నాగార్జున క్రియేట్ చేసిన రికార్డులో చేరొచ్చు. ఇప్పటి జనరేషన్లో ఏ హీరోకు ఈ అరుదైన రికార్డు సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
May 7, 2020, 7:59 AM IST