మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ టైమ్ నడుస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల నిహారిక పెళ్లిని ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి వేడుకలను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సహా వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ సహా ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సంక్రాంతి వేడుకల్లో ఓ ముఖ్య అతిథి పాల్గొని సందడి చేశారు. ఇంతకూ ఆ అతిథి ఎవరో కాదు.. కింగ్ అక్కినేని నాగార్జున.
ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగలో చిరంజీవి, నాగార్జున కలవడం ఇద్దరి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే విషయమే. అయితే పండగ కోసమే కలిశారా.. లేక అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రమోషన్స్ పరంగా ఏదేని హెల్ప్ తీసుకోవడానికి నాగార్జున వెళ్లాడా అని తెలియడం లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున వైల్డ్ డాగ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతుంటే.. చిరంజీవి ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసి తదుపరిగా లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్‌ను ట్రాక్ ఎక్కించడానికి సిద్ధమవుతున్నాడు.