Bangarraju Trailer : అక్కినేని అభిమానులకు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించిన మల్టీస్టారర్ బంగార్రాజు ట్రైలర్ విడుదల అయింది.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో జోరు పెంచిన చిత్రబృందం.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. నాగార్జున అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తండ్రీకొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో ఈ ట్రైలర్ పండగ శోభను ముందుగానే తీసుకొచ్చిందనిపిస్తుంది. ఇందులో నాగచైతన్య మనవడిగా కన్పించనున్నాడు. నాగచైతన్య, కృతి శెట్టిలను కలపడానికి నాగార్జున, రమ్యకృష్ణ చేసే ప్రయత్నాలు హైలెట్ గా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. నాగచైతన్య కూడా వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ మేనరిజంతో అదుర్స్ అన్పించాడు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు ఆడియన్స్ నుండి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బంగార్రాజు జనవరి 14న విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది ఇక బంగార్రాజు విషయానికి వస్తే.. షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల నలబై నిమిషాల నిడివితో రానుంది.
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు . 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన'.. అద్భుతమైన విజయం సాధించింది.
ఈ కుటుంబ కథా పల్లెటూరి చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా చేశారు. స్పెషల్ సాంగ్‌లో అనసూయ, హంస నందిని లాంటి బ్యూటీస్ అదరగొట్టేశారు. ఇప్పుడీ చిత్రానికే సీక్వెల్‌గా రూపొందింది 'బంగార్రాజు'. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. స్పెషల్ సాంగ్‌లో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా.. నాగ్-చైతూతో కలిసి డ్యాన్స్ చేసింది. మీనాక్షి దీక్షిత్, దర్శనా బనిక్, వేదిక, దక్ష నగర్కర్, సిమ్రత్ కౌర్ కూడా అతిథి పాత్రల్లో మెరిసి సందడి చేశారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.