తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ ప్రముఖుల తమ ఓటు హక్కును వినియోగించకునేందకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇప్పటికే చిరంజీవి,రామ్ చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి సినీ ప్రముఖులు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అక్కినేని అమల కూడా ఓటు హక్కును వినియోగించుకుంది. ఇంకోవైపు నాగ చైతన్య, సమంత సమేతంగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతం ఓటు వేసినట్టు సిరా గుర్తును చూపించారు. అంతేకాదు ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వం కోసం అందరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.