సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య(Naga Chaitanya) పలు ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయాడు. వరుస సినిమాలు ఓకే చేస్తూ వస్తున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సక్సెస్‌తో చైతన్య థాంక్యూ మూవీ చేస్తున్నాడు. 'బంగార్రాజు' సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య, మరో సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఆ సినిమా పేరే 'థ్యాంక్యూ'. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలీష్ లుక్ తో నాగచైతన్య కనిపిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా అలరించనుంది. కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. మరో ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ నటించారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు
టాలీవుడ్లో కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మరిన విషయం నాగ చైతన్య, సమంత విడాకులు. వీరిద్దరు గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. కారణం చెప్పకుండా.. తాము వేర్వేరు మార్గాల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఇకపై భార్య, భర్తలుగా కొనసాగలేమని.. విడిపోయి మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని (Samantha Divorce news) చెప్పారు. విడాకులు తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. సమంత వరుస సినిమాలు చేస్తుండగా... అటు చైతు కూడా.. పలు సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో కూడా నాగ చైతన్య అమీర్ ఖాన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.