స్టార్ డైరెక్టర్ చిత్రంలో మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..

ప్రస్తుతం అక్కినేని హీరోలందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఒక్క నాగ చైతన్య మాత్రమే రీసెంట్‌గా ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. తాజాగా నాగ చైతన్య, సమంత ఒక సూపర్ హిట్ దర్శకుడి చిత్రంలో మరోసారి కలిసి పనిచేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: December 2, 2019, 1:30 PM IST
స్టార్ డైరెక్టర్ చిత్రంలో మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..
నాగ చైతన్య, సమంత (Instagram/Photo)
  • Share this:
ప్రస్తుతం అక్కినేని హీరోలందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఒక్క నాగ చైతన్య మాత్రమే రీసెంట్‌గా ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అదే ఊపులో మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా నాగ చైతన్య విజయ్ దేవరకొండకు  ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్‌తో నెక్ట్స్ మీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తైయినట్టు సమాచారం. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్  పతాకంపై నిర్మించే అవకాశాలున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కేబోయే ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టేనర్‌ అని చెబుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా నాగ చైతన్యకు జోడిగా మరోసారి సమంత నటించే అవకాశాలున్నాయి. మరి ఈ సినిమాతో నాగ చైతన్య,సమంత మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>