Naga Chaitanya Akkineni - Hyderabad Traffic Police : హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. మన దేశంలో రూల్స్ అనేవి సామాన్యులకే.. అదే పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తప్పులు చేస్తే చూస్తూ పోలీసులు కానీ మరే వ్యవస్థ వారి జోలికి పోవడానికే భయపడతారనే వాదన కూడా ఉంది. ఇక కొంత మంది అధికారులు పెద్దల మెప్పు కోసం చేసే తప్పులు మొత్తం వ్యవస్థనే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తప్పు చేస్తే చూస్తూ పోయే అధికారులతో పాటు.. చట్టాన్ని నిక్కచ్చిగా పాటించే అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు. ఇక మన దగ్గర హీరోలు కొంత మంది తాము చట్టానికీ అతీతలమనే భావన ఉంటోంది. ఏదో పై నుంచి ఊడి పడినట్టు బిల్డప్ ఇస్తుంటారు. తాజాగా చట్ట విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు,సెలబ్రిటీలకు హైదరాబాద్ పోలీసులు ఫైన్ వేస్తూ ఎవరు చట్టానికీ అతీతులు కారనే సందేశం ఇస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య కారుకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ అద్దాలు అమర్చి ఉండటంతో పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ను తొలిగించారు. అంతేకాదు ఈయన నడిపిస్తోన్నకారుకు రూ. 700 రూపాయల చలాన్ విధించారు. దీంతో పాటు ఆ దారిలో నిబంధనలకు విరుద్దంగా వెళుతున్న మరికొంత మందిపై పోలీసులు జరిమానాలు విధించారు.
రీసెంట్‌గా అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్,దర్శకుడు సంబంధించిన కార్లకు నల్ల అద్దాలు తొలిగించడంలో పాటు చెరో రూ. 700 జరిమాన విధించిన సంగతి తెలిసిందే కదా. నాగ చైతన్య విషయానికొస్తే.. గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. . ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతో పాటు నాగ చైతన్య చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. తాజాగా ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రానికి ఓకే చెప్పారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad Traffic Police, Naga Chaitanya Akkineni, Tollywood