‘వెంకీ మామ’తో నా అల్లరి మాములుగా ఉండదు.. నాగ చైతన్య..

అవును అక్కినేని నట వారసుడు.. తన మేనమామైన వెంకటేష్ కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ‘వెంకీమామ’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ..

news18-telugu
Updated: December 9, 2019, 11:44 AM IST
‘వెంకీ మామ’తో నా అల్లరి మాములుగా ఉండదు.. నాగ చైతన్య..
వెంకీ మామ (Twitter/Photo)
  • Share this:
అవును అక్కినేని నట వారసుడు.. తన మేనమామైన వెంకటేష్ కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ‘వెంకీమామ’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘ప్రేమమ్’ చిత్రంలో తొలిసారి మామతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెంకీమామ’లో పూర్తి స్థాయిలో వెంకీ మామతో కలిసి నటించానన్నారు. అంతేకాదు... తన జీవితంలో ‘మనం’ తర్వాత ఆ తర్వాత ‘వెంకీ మామ’ సినిమా మరిచిపోలేని జ్ఞాపకాలు. ఈ సినిమాలో కెమెరా వెనక ఓ మామ.. ముందు మరో మామ. అని నవ్వుతూ తన మేనమామ వెంకటేష్‌ గొప్పతనాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాదు ఈ సినిమా మా మేనమామ పుట్టినరోజైన డిసెంబర్ 13న విడుదల కావడం విశేషం. కొందరు కమర్షియల్ ఎలిమెంట్స్.. కొందరు కంటెంట్‌ పట్టుకొని సినిమా చేస్తారు. కానీ బాబా (కే.యస్.రవీంద్ర) రెండు అంశాలను మిలితం చేసి ‘వెంకీమామ’ సినిమాను తీర్చిదిద్దిన విధానం అందరికీ తప్పుకుండా నచ్చుతుందన్నారు నాగచైతన్య.
First published: December 9, 2019, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading