హోమ్ /వార్తలు /movies /

HBD Sushanth: ‘ZEE 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో జాయిన్ అయిన హీరో సుశాంత్..

HBD Sushanth: ‘ZEE 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో జాయిన్ అయిన హీరో సుశాంత్..

HBD Sushanth: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) మనవడిగా కింగ్ నాగార్జున (Nagarjuna) మేనల్లుడుగా ‘కాళిదాసు’ (Kalidasu) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్ (Sushanth).

  HBD Sushanth: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) మనవడిగా కింగ్ నాగార్జున (Nagarjuna) మేనల్లుడుగా ‘కాళిదాసు’ (Kalidasu) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్ (Sushanth). తను కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే కరెంట్, అడ్డా, దొంగాట, అటాడుకుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ లాంటి సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. "అల వైకుంఠ పురములో"..సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్‌లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరోనా టైం లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

  తాజాగా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో ఏంతో ఆసక్తికరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో తొలిసారిగా "ZEE5" వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకొని నటించడం విశేషం. ప్రస్తుతం ZEE5 లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు "ZEE5" వెబ్ సిరీస్ లో నటించ డానికి ముందుకు వచ్చిన సుశాంత్‌ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ మా రాబోయే వెబ్‌సిరీస్‌కు స్వాగతం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  Bheemla Nayak 21 days collections: ‘భీమ్లా నాయక్’ 21 డేస్ కలెక్షన్స్.. నష్టాలు తప్పట్లేదుగా..!

  ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్‌ను పోలీస్ గెటప్‌లో చూడలేదు. పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటో ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.ఈ గెటప్ ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ మీద విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. మార్చ్ 18న జరిగే సుశాంత్ బర్త్ డే వేడుకలో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేస్తూ తను నటించే వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ZEE 5 యూనిట్ తెలియజేసింది. దాంతో పాటు రవితేజ రావణాసుర సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

  First published:

  ఉత్తమ కథలు