HOME » NEWS » movies » AKKINENI BROTHERS OUT OF SANKRANTHI RACE MHN

Naga Chaitanya - Akhil : సంక్రాంతి రేసులో అక్కినేని బ్ర‌ద‌ర్స్ డౌటేనా..?

Naga Chaitanya - Akhil : అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్.. సంక్రాంతి రేసు నుండి బయటకు వచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 4, 2020, 11:34 PM IST
Naga Chaitanya - Akhil : సంక్రాంతి రేసులో అక్కినేని బ్ర‌ద‌ర్స్ డౌటేనా..?
akkineni naga chaitanya, akhil akkineni
  • Share this:
సినిమా రిలీజుల‌కు పండుగ రోజులే కావాల‌ని నిర్మాత‌లు కోరుకుంటారు. ముఖ్యంగా ద‌స‌రా, క్రిస్మ‌స్‌, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌నుకుంటారు ప్రొడ్యూస‌ర్స్‌. కానీ ఈ ఏడాది అలాంటి ఆశ‌ల‌కు ఛాన్స్ లేకుండా పోయింది..క‌రోనా ప్ర‌భావంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో నిర్మాత‌ల‌కు సినిమాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. దాదాపు ఆరేడు నెల‌లు సినిమా రంగం సైలెంట్‌గా ఉండింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొద‌ల‌వుతున్నాయి. థియేట‌ర్స్ ఓపెన్ చేసుకోవ‌డానికి కూడా అవ‌కాశం ద‌క్కింది. యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యాయి. క్ర‌మంగా సినిమాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, క‌ప‌ట‌ధారి చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. అయితే అంద‌రి దృష్టి వ‌చ్చే ఏడాది సంక్రాంతి మీద‌నే ఉంది. స్టార్ హీరోల సినిమాలేమైనా వ‌స్తాయేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. సంక్రాంతికి వ‌చ్చే సినిమాల విడుద‌ల‌పై ఇప్పుడిప్పుడు క్లారిటీ వ‌స్తుంది.

సంక్రాంతి బ‌రిలో భారీ బడ్జెట్ చిత్రాలైతే రావడం లేదు కానీ.. ర‌వితేజ.. క్రాక్‌, నాగ‌చైత‌న్య.. ల‌వ్‌స్టోరి, అఖిల్‌.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌.. అల్లుడు అదుర్స్ ఉంటాయ‌ని వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు నాగ‌చైత‌న్య.. ల‌వ్‌స్టోరి, అఖిల్‌.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌చ్చున‌ని అంటున్నారు. అందుకు కార‌ణం కోవిడ్ ప్ర‌భావ‌మేన‌ని అంటున్నారు. యాబై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమాల‌ను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డాన్ని నిర్మాత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. అందువ‌ల్ల సంక్రాంతి కంటే ఈ సినిమాల‌ను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి సంద‌డి చేద్దామ‌నుకున్న అక్కినేని అభిమానుల‌కు నిరాశ క‌లిగిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

లవ్‌స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మ‌జిలీ స‌క్సెస్ త‌ర్వాత నాగ‌చైత‌న్య. చేస్తున్న సినిమా ల‌వ్‌స్టోరి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వహించగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. ఇందులో చైత‌న్య తెలంగాణ కుర్రాడిగా క‌న‌ప‌డ‌తాడ‌ని అంటున్నారు. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రానున్న చిత్ర‌మిది. ఈ సినిమా స‌క్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాల‌ని నాగ‌చైత‌న్య అనుకుంటుండ‌గా, మ‌రోవైపు అఖిల్‌, హ‌లో, మ‌జ్ను చిత్రాల‌ను ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అఖిల్ అక్కినేని ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించాడు. ఈ సినిమా స‌క్సెస్ అయితే, భాస్క‌ర్‌కు కూడా బ్రేక్ దొరికిన‌ట్టేన‌ని చెప్పొచ్చు.
Published by: Anil
First published: December 4, 2020, 11:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading