AKKINENI AMALA SENSATIONAL COMMENTS ON SAMANTHA TA
సమంత పై అమల షాకింగ్ కామెంట్స్.. ఇంట్లో చైతూతో ఆ పనులు చేయిస్తుందంటూ..
తెలుగు సినిమాలో మనం అనేది ఓ సంచలనం. ఈ సినిమాతో పాటు నాగార్జున, నాగ చైతన్య కూడా కలిసి నటించారు. ఇప్పుడు అక్కినేని అభిమానులకు మరో తీపి కబురు కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.
తన కోడలు సమంతపై అత్తమ్మ అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసారు. సమంత అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఇప్పటి వరకు ఇంట్లో ఒక్కసారి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌కు
తన కోడలు సమంతపై అత్తమ్మ అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసారు. సమంత అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఇప్పటి వరకు ఇంట్లో ఒక్కసారి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌కు వంట చేసి పెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా అమల అక్కినేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సమంతపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అక్కినేని అమల మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో నా భర్త అక్కినేని నాగార్జున మంచి కుక్. అలాంటపుడు వంట చేయడానికి ప్రత్యేకంగా మరొకర్ని తీసుకోవడం ఎందుకు అంటూ సరదగా కామెంట్స్ చేసింది. నాగార్జున మంచి యాక్టరే కాదు.. వంట చేయడంలో కూడా పర్ఫెక్ట్. సమంతకు మాత్రమే కాదు.. నాకు కూడా వంట సరిగా రాదంటూ అమల చెప్పుకొచ్చింది. ఇక నాగ చైతన్య కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో వంట చేశారని సమంత ఎన్నో సందర్భాల్లో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.నాగ చైతన్యతో సమంత విషయానికొస్తే.. ఎన్నో ఏళ్లుగా ప్రేమించికున్న వీళ్లు.. 2017లో ఒకింటి వాళ్లు అయ్యారు. అంతకు ముందు వీళ్లిద్దరు పలు సినిమాల్లో నటించారు. ఇక పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ‘మజిలీ’ సినిమాలో నటించారు. ఇక పెళ్లైన తర్వాత కూడా సమంత హీరోయిన్గా సత్తా చూపెడ్తూనే ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.