టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత(Samantha)అనారోగ్యానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ (Viral)అవుతోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించిన సమంత తనకు మయోసిటిస్ (Myositis)వ్యాధి వచ్చిందని..అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానంటూ సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ పెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు ఆమె హెల్త్ కండీషన్‌పై విచారం వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ట్వీట్(Tweet)లు చేశారు. అయితే ఇందులో ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే సమంత హెల్త్ బాగోలేదని తెలిసిన వెంటనే అక్కినేని ఫ్యామిలీలో సమంత మాజీ భర్త నాగచైతన్య(Naga Chaitanya),మామ నాగార్జున(Nagarjuna)కాకుండా అక్కినేని అఖిల్(Akhil)స్పందించడం విశేషంగా చూస్తున్నారు సమంత అభిమానులు.
షాకింగ్ న్యూస్‌పై స్టార్స్ స్పందన..
టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ సమంత గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆమె ఏదో సర్జరీ చేయించుకుందని..అందుకే ఫేస్ మారిపోయిందనే పుకార్లు షికార్లు చేశాయి. ఈక్రమంలోనే సమంత అసలు విషయం చెప్పి అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని చాలా మందిని షాక్‌కి గురి చేసింది. తనకు మయోసిటిస్ అనే వ్యాధి సోకిందని చెప్పింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పారంటూ సమంత చేసిన ట్వీట్ చేయడంతో వార్త వైరల్ అయింది.
View this post on Instagram
త్వరగా కోలుకోవాలని..
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు గతంలో క్యానర్సర్ బారినపడి జయించారు. అయితే సమంతకు సోకింది మయోసిటిస్ వ్యాధి కావడంతో అందరూ ఏంటీ ఈ వ్యాధి..? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈక్రమంలోనే సమంత చాలా గుండె ధైర్యం కలిగిన అమ్మాయని త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్ , హన్సిక, లావణ్య త్రిపాఠి,శ్రియ వంటి హీరోయిన్లతో పాటు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
మాజీ మరిది పరామర్శ..
ఆటో ఇమ్మ్యూనిటి డిజాస్టర్‌గా ఈ వ్యాధిని చూడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే సమతం హెల్త్ కండీషన్ బాగోలేదని తెలిసిన వెంటనే అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరో అఖిల్ తన సానుభూతి తెలియజేశాడు. అందరి ప్రేమాభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ ట్వీట్ చేశాడు. హీరో నాగచైతన్య, నాగార్జున వంటి కుటుంబ సభ్యుల కంటే అఖిల్ ముందుగానే స్పందించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.