కష్టాలన్నీ ఈ అక్కినేని వారసుడికే.. ఈ సారైనా కలిసోచ్చేనా..

Akhil Akkineni : అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇంతవరకు సాలిడ్ హిట్ పడలేదు.

news18-telugu
Updated: June 30, 2020, 10:10 AM IST
కష్టాలన్నీ ఈ అక్కినేని వారసుడికే.. ఈ సారైనా కలిసోచ్చేనా..
అఖిల్ అక్కినేని Photo : Twitter
  • Share this:
అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇంతవరకు సాలిడ్ హిట్ పడలేదు. మొదటి సినిమా అఖిల్‌తోనే పెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్న అఖిల్.. ఇక అప్పటినుండి హిట్ కోసం ఆరాటపడుతూనే ఉన్నాడు. మాస్ కథల్నీ వదిలీ ప్రేమ కథలను ఎంచుకున్న కూడా ఆయనకు అదృష్టం కలిసిరావట్లేదు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. కొడుక్కు ఓ మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడట. ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ రిలీజ్ అవ్వాలి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తమిళ దర్శకుడు మిత్రన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. విశాల్ హీరోగా అభిమన్యుడుతో సత్తా చాటిన డైరక్టర్ మిత్రన్ అఖిల్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందట. అంత కొత్తగా ఉండడంతో అఖిల్ కొంత ఆలోచనలో పడ్డాడట. మామూలుగా కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
First published: June 30, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading