అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ఏజెంట్ (Agent) అనే ఓ స్పై థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం మనాలి చేరుకున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ బార్న్(Bourne) సిరీస్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ మార్చేశారు. సిక్స్ బాడీ బిల్డ్ చేసి షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హై యాక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ షూటింగ్ మనాలిలో (Manali) జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశారు. ఈ ఏజెంట్ సినిమాలో ప్రెజెంట్ షూట్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ కానున్నాయని, అందుకోసం యూనిట్ సహా అఖిల్ స్పెషల్ కేర్ తీసుకొని షూట్ చేస్తున్నారని సమాచారం.
చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి సినిమా చేసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా ఇదే కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్‌గా నటిస్తుండటం విశేషం. మిలటరీ మేజర్‌గా మమ్ముట్టి కనిపించనున్నారాట. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Grappling to STRIKE HARD 👊🏾#AGENT shoot progressing at a brisk pace in Manali with fierce action sequences💥💥#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/GN3hKKijMy
— AK Entertainments (@AKentsOfficial) May 25, 2022
ఈ (Agent) చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిన అఖిల్.. స్టైలిష్ లుక్‌లో కండలు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. చిత్రంలో ఆయన రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించినందుకు గాకు అఖిల్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.
అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) ఆశించిన ఫలితం రాబట్టి హిట్ కావడంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యిందంటే ఇక అఖిల్ కెరీర్ మలుపుతిరిగినట్లే అని చెప్పుకుంటున్నారు. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్. సో.. చూడాలి మరి అఖిల్ కెరీర్‌కి ఈ ఏజెంట్ సినిమా ఏ మేర ప్లస్ అవుతుందనేది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agent film, Akkineni akhil, Surender reddy