Home /News /movies /

AKKINENI AKHIL AGENT EXPECTED PRE RELEASE BUSINESS HERE SLB

Agent pre release Business: అక్కినేని వారసుడి మార్కెట్ ఎలా ఉందో చూడండి!

Photo Twitter

Photo Twitter

Akkineni Akhil: వరుస పరాజయాలతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్.. ఏజెంట్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్ నుంచి వదిలిన అఖిల్ లుక్స్ యూత్ ఆడియన్స్ మెప్పు పొందాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇంకా చదవండి ...
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అఖిల్ (Akkineni Akhil). కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అందుకొని తన మార్క్ చూపించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ యువ హీరో.. మరికొద్ది రోజుల్లో ఏజెంట్ (Agent) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా చేంజ్ చేసుకొని సిక్స్ పాక్స్ తెచ్చుకున్నారు అఖిల్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఈ ఏజెంట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్ నుంచి వదిలిన అఖిల్ లుక్స్ యూత్ ఆడియన్స్ మెప్పు పొందాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ఏజెంట్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే స్పెషల్ మూవీ అవుతుందని అంటున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammutty) కీలక పాత్రలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని అంటున్నారు.

ఆగస్టు 12న (Agent Release Date) ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విడుదలకు ముందే కాస్త బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా కేవలం ఆంధ్ర ఏరియాలోనే దాదాపు 30 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 నుంచి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని, ఈ సినిమా హక్కుల కోసం పలు బిగ్గెస్ట్ కంపెనీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు.

ఇకపోతే అఖిల్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.. అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఆయన చిన్నతనంలోనే జరిగింది. బాలనటుడిగా సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక హీరోగా అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు ఏజెంట్ అంటూ ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Agent, Akhil, Akhil Akkineni

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు