హోమ్ /వార్తలు /సినిమా /

Akiran Nandan : అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

Akiran Nandan : అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

Akiran Nandan : అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Akiran Nandan : అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఏప్రిల్ 18న అకిరా నందన్ 18వ పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దానికి సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరా నందన్.. ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ వారసుడు అనే ఒకేఒక్క క్రేజ్‌తో ఈయన పేరు మార్మోగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించినా కూడా రచ్చ చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. ఇక ఏప్రిల్ 8న అకీరా బర్త్ డే రోజున అయితే ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేసారు అభిమానులు. ఇదే సమయంలో ఈయన ఎంట్రీపై కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే రాజకీయాలు బిజీగా ఉంటున్నారు. .

  దాంతో ఎప్పుడు సినిమాలు మానేస్తాడో చెప్పడం కూడా కష్టమే. ఐనా పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపు నాలుగైదు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో పలకరించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించాయి. త్వరలో హరి మర వీర మల్లు’తో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’ వంటి సినిమాలున్నాయి. దీంతోొ పవన్ అభిమానులు ఆయా సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇక మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వాళ్లలో కనిపించింది. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు ఉండే పండగ వేరు. పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇప్పుడు ఈయన సినిమాలతో బిజీగా ఉన్నాడు.. దాంతో పాటు తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

  Rashmika Mandanna : ఆచార్య సహా రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..

  తాజాగా పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా అకిరా నందన్ .. బాక్సింగ్ చేస్తోన్న వీడియోను షేర్ చేసింది. మరోవైపు అకికా నందన్ .. తనకు మంచి మిత్రుడు అని పేర్కొంది. తనకు అకిరా కుమారుడే కాదు.. తనకు సోదరుడు.. మిత్రుడుగా ఎంతో గొప్పవాడు. దయ,నిజాయితీ తన కుమారుడితో నచ్చేదన్నారు. ఇక అకిరానందన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసింది.

  View this post on Instagram

  A post shared by renu (@renuudesai)

  ఇక అకిరా నందన్ బాక్సింగ్ ప్రాక్టీస్ చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో అకిరా హీరోగా ఇండ్రడ్యూస్ అవుతున్నాడనే వార్తలను అభిమానులు షేర్ చేసారు. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ.. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టారు. అతనికి నటుడయ్యే ఉద్దేశ్యం లేదు. అతను ఏ సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది. భవిష్యత్తులో సినిమాలోకి వస్తానంటే అది అతనిష్టం చెప్పుకొచ్చారు.

  Ranbir Kapoor - Alia Bhatt Marriage : RRR భామ ఆలియా భట్,రణ్‌బీర్ కపూర్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. కన్ఫామ్ చేసిన కుటుంబ సభ్యులు..

  పవన్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే 6.4 హైట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జూనియర్ పవర్ స్టార్. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటికి వచ్చాయి. వీటన్నింటికీ రేణు దేశాయ్ తన ట్వీట్‌తో చెక్ పెట్టేసారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akira nandan, Pawan kalyan, Renu Desai, Tollywood

  ఉత్తమ కథలు