హోమ్ /వార్తలు /సినిమా /

Akira Nandan: పవన్ కళ్యాణ్ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పండగే ?

Akira Nandan: పవన్ కళ్యాణ్ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పండగే ?

అకీరా నందన్ బాక్సింగ్ వీడియో బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తమ హీరో తనయుడు త్వరలో సినిమాల్లోకి వస్తున్నాడని అంటున్నారు.

అకీరా నందన్ బాక్సింగ్ వీడియో బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తమ హీరో తనయుడు త్వరలో సినిమాల్లోకి వస్తున్నాడని అంటున్నారు.

అకీరా నందన్ బాక్సింగ్ వీడియో బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తమ హీరో తనయుడు త్వరలో సినిమాల్లోకి వస్తున్నాడని అంటున్నారు.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్(Akira Nandan) ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.తాజాగా అకీరా నందన్ వీడియో ఒకటి బయటకు రావడంతో... అతను సినిమాల్లోకి వస్తాడడంటూ పవన్ ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన రేణు దేశాయ్.. అలాంటిదేం లేదని చెప్పింది. అకీరాకు నటుడిగా మారాలనే ఉద్దేశ్యం లేదని తను అందు కోసం రెడీ కావడం లేదని స్పష్టం చేసింది. అయితే రేణు అలా అన్నా అకీరా ఎంట్రీ మాత్రం ఖాయమని తెలుస్తోంది. అదీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాతోనే అకీరా వెండితెరకు పరిచయం అవుతున్నాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

  ఇక ఈ విషయానికి వస్తే.. పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్ ని ఎట్టకేలకు గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు. పద్మశ్రీ తోట తరణి పర్య వేక్షణలో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం భారీ సెట్ లని నిర్మించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా హల్ చల్ చేశాయి. ఆ సెట్ లలో కీలక ఘట్టాల సీన్స్ తో ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు క్రిష్ ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్(Akira Nandan) నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

  హరి హర వీర మల్లు సినిమాలో యంగ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) గా అకీరా నందన్ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ పాత్రలో నటించడం కోసం అకీరా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అకిరాని పవన్ యంగ్ పాత్రలో చూపించాలని డైరెక్టర్ క్రిష్(Krish) కి మెరుపులాంటి ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనని వెంటనే పవన్ కళ్యాణ్ కు చెప్పారు.దీంతో అది నచ్చిన పవర్ స్టార్వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరి హర వీరమల్లుగా రాబిన్ హుడ్ లాంటి గజ దొంగ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్(Nidhi Agarwal)కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ లేడీ నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు.

  First published:

  Tags: Akira nandan, Hari Hara Veera Mallu, Nidhi agarwal, Pawan kalyan

  ఉత్తమ కథలు