Home /News /movies /

AKIRA NANDAN SAME AS PAWAN KALYAN IN ATTITUDE SAYS RENU DESAI SR

అకిరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ లాగే.. మొండిమనిషి : రేణు దేశాయ్

రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram

రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram

రేణు దేశాయ్ అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన పిల్లలు అకిరా ఆధ్యల మనస్తత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ఇటీవల ఓ తెలుగు టీవీషోకు హాజరైన రేణు దేశాయ్..యాంకర్ అలీతో మాట్లాడుతూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ అలీ, రేణు దేశాయ్‌తో మాట్లాడుతూ.. "రేణు" అనే పేరు మీకు ఇష్టం లేదంట కదా..? ఎందుకని ప్రశ్నించగా. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'అవును.. నాకు నా పేరు అంటే నచ్చదు. రేవతి లేదా రేవ అని పెడితే బావుండేది' అని చెప్పింది. అలీ మరో ప్రశ్న అడుగుతూ.. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ మీరే అంటగా..? అని అడగ్గా... 'నేను జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్‌గా చేశాను.. కానీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎస్.జె.సూర్య గారు, రత్నం గారు కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యం" అంటూ చెప్పారు..రేణు దేశాయ్. యాంకర్ అలీ మరో ప్రశ్న అడుగుతూ..మీరు పుట్టినప్పుడు మీ తండ్రి హాస్పిటల్‌కి కూడా వెళ్లలేదట..అని గర్తు చేయగా.. ఆమె ఎమోషనల్ అవుతూ...అవును ఆడపిల్ల పుట్టిందని..అందుకే రాలేదని బావోధ్వేగంతో చెప్పారు.

    రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram
    రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram


    ఆమె తన పిల్లలు అకిరా ఆధ్యల మనస్తత్వం గురించి మాట్లాడుతూ.. అకిరా నందన్ పవన్ కళ్యాణ్ లాగే చాల మొండిమనిషి అనీ ఇంట్లో తాను చేసే వంటల దగ్గర నుండి ప్రతిరోజు తనకు ఏమి కావాలో చాల స్పష్టంగా ఉంటాడనీ.. ఏవిషయంలో తేడా వచ్చినా సర్దుకోడని పేర్కోంది.  అదేవిధంగా  కూతురు ఆద్య గురించి మాట్లాడుతూ..తన కూతురు.. తన పట్ల ఎంతో ప్రేమగా ఉంటుందని.. ఆద్య తన కూతురుగా పుట్టకపోతే తాను ఎప్పుడో చనిపోయి ఉండేదానంటూ ఉద్వేగంగా మాట్లాడింది రేణు దేశాయ్.
    First published:

    Tags: Pawan kalyan, Renu Desai, Telugu Cinema News, Telugu Movie News

    తదుపరి వార్తలు