AKHILS NAME TATTOOED ON ANCHOR VISHNU PRIYA HAND SRIMUKHI REVEALS SECRET TA
యాంకర్ విష్ణు ప్రియ లైఫ్‌లో ఆ హీరోకు ప్రత్యేక స్థానం ఉందట.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి,విష్ణుప్రియ (Instagram/Photo)
యాంకర్ శ్రీముఖి, విష్ణు ప్రియ కలిసి తాజాగా ఓ షోలో పార్టిసిపేట్ చేసారు. ఈ సందర్భంగా యాంకర్ శ్రీముఖి.. విష్ణుప్రియకు సంబంధించిన పలు సీక్రెట్స్‌ను బట్టబయలు చేసింది.
తెలుగులో పాపులర్ అయిన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. పటాస్ వంటి షోతో మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఊపుతోనే బిగ్‌బాస్ సీజన్3లో పార్టిసిపేట్ చేసి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు తెలుగులో యాంకర్ విష్ణుప్రియ కూడా యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీళ్లిద్దరు కలిసి తాజాగా ఓ షోలో పార్టిసిపేట్ చేసారు. ఈ సందర్భంగా యాంకర్ శ్రీముఖి.. విష్ణుప్రియకు సంబంధించిన పలు సీక్రెట్స్‌ను బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ టీవీ షోలో యాంకర్ శ్రీముఖి .. మరో యాంకర్ విష్ణు ప్రియకు సంబంధించిన విషయాన్ని బయట పెట్టింది. రీసెంట్గా స్టార్ మా ఛానెల్లో ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ షోకు ఝాన్సీ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించాలని కోరగా.. శ్రీముఖి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. అది కూడా తన తోటి యాంకర్ విష్ణు ప్రియకు సంబంధించిన సీక్రెట్ రివీల్ చేసింది.
అఖిల్ పేరును చేతిపై టాటూ వేయించుకున్న యాంకర్ విష్ణు ప్రియ (Instagram/Photo)
యాంకర్ విష్ణు ప్రియకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా రాబోతున్న అఖిల్ అంటే విపరీమైన పిచ్చి అని చెప్పుకొచ్చింది. అఖిల్ విషయానికొస్తే.. ఈ మన్మథ పుత్రుడి అందానికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ మిస్టర్ మజ్ను అందానికి అమ్మాయిలు ఎపుడో పడిపోయారు. ఈ లిస్టులో ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో విష్ణు ప్రియ కూడా ఉందని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అంతేకాదు అఖిల్‌కు సంబంధించిన టాటూ ఆమె చేతిపై వేయించుకున్నట్టు శ్రీముఖి చెప్పుకొచ్చింది.
A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) on
ఈ సందర్భంగా ఆమె చేతిపై అఖిల్ పేరుతో ఇంగ్లీష్‌లో అక్షరాలను చూపించింది శ్రీముఖి. మొత్తంగా చూసుకుంటే అఖిల్‌కు మాములు ప్రేక్షకుల్లోనే కాదు. స్టార్ యాంకర్స్‌తో పాటు సెలబ్రిటీలు ఉన్న విషయం ఈ సంఘటనతో స్ఫష్టమైంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.