అఖిల్ సరసన మెగా భామ.. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వస్తున్న అక్కినేని హీరో

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో అఖిల్ సరసన పూజా హెగ్డేని ఎంచుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు చక్కని టైటిల్ కూడా దొరికిందట. త్వరలోనే అధికారికంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ప్రకటించనుంది చిత్రబృందం.

news18-telugu
Updated: August 26, 2019, 6:53 AM IST
అఖిల్ సరసన మెగా భామ..  ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వస్తున్న అక్కినేని హీరో
అఖిల్ అక్కినేని ఫైల్ ఫోటో
  • Share this:
అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ‘మనం’ సినిమాతో మెరుపులా మెరిసిన అఖిల్.. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ టైటిల్‌ వచ్చేటట్టు చేసిన మాస్ మూవీ కలిసిరాలేదు. మొదటి సినిమాకే అన్ని చూపించాలనే తాపత్రయంలో కథను కూడా పట్టించుకోకుండా చేసిన ఈ సినిమా హీరోగా అఖిల్‌కు కెరీర్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ సినిమాను అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘హలో’ సినిమా బాగున్నా...మరీ క్లాస్‌గా ఉండటంతో ఈ సినిమా కూడా అఖిల్‌కు సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. కాగా.. అఖిల్ మూడో చిత్రాన్ని 'మిస్టర్‌ మజ్ను' అనే ప్రేమకథ నేపథ్యంగా చేసాడు. ఇది పరవాలేదనిపించింది. 'మిస్టర్‌ మజ్ను’ తరవాత అఖిల్‌ కొంత విరామం తీసుకుని  బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తోంది. 

View this post on Instagram
 

🔮 #LakmeFashionWeek #runwayready


A post shared by Pooja Hegde (@hegdepooja) on

ఇటీవలే షూటింగ్ కూడా మొదలైంది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ కోసం చిత్రబృందం చాలా మందినే ఆడిషన్స్‌ చేయడం జరిగింది.  ఏమైందో ఏమో గాని, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ సరసన పూజా హెగ్డేని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రాబోతోన్న ఈ సినిమాకు చక్కని టైటిల్ కూడా దొరికిందట. త్వరలోనే అధికారికంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ప్రకటించనుంది చిత్రబృందం.
First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు