AKHIL TO ROMANCE A NEW ACTRESS AND THE SENTIMENT SCARES AKKINENI FANS MHN
Akhil Akkineni: కొత్త హీరోయిన్‌తో అఖిల్ జోడీ... అక్కినేని ఫ్యాన్స్‌ని భయపెడుతున్న సెంటిమెంట్
Akhil to romance a new actress
Akhil Akkineni - New Movie: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ముంబై మోడల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇంతకీ ఎవరామె తెలుసా..?
అక్కినేని హీరో అఖిల్ నాలుగు సినిమాలు చేశాడు. అందులో రీసెంట్గా చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా.. మిగిలిన మూడు సినిమాలు ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు. ఇవి కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అఖిల్ అక్కినేని ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ప్రేక్షకులను మెప్పించనుంది. కాగా.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ముంబై మోడల్ సాక్షి వైద్య హీరోయిన్గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గానే ఫొటో షూట్ కూడా పూర్తయ్యిందంటూ.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అఖిల్ అక్కినేని కొత్త హీరోయిన్‌తో చేస్తాడనే వార్తలపై అక్కినేని ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారట. ఎందుకంటారా? అఖిల్‌ను భయపెడుతున్న సెంటిమెంట్ ఏమంటారా? అసలు విషయంలోకి వెళితే.. అఖిల్ ఇప్పటి వరకు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాల్లో తొలి రెండు సినిమాలకు కొత్త హీరోయిన్సే నటించారు. అఖిల్‌లో సయేషా సైగల్ హీరోయిన్ అయితే, హలోలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. మూడో సినిమాలో నిధి అగర్వాల్ నటించినా, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనుకోండి. ఇప్పుడు నాలుగో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే తొలి రెండు సినిమాల్లో డెబ్యూ హీరోయిన్స్‌తో అఖిల్ నటించి డిజాస్టర్స్ చూశాడుగా.. మరి ఇప్పుడు చేయబోతున్న ఐదవ చిత్రంలో కొత్త హీరోయిన్‌తో చేయడం ఎంత వరకు కరెక్ట్ అని భావిస్తున్నారట.
అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఒకవైపు హీరోకి, మరో వైపు దర్శకుడికీ హిట్ అవసరం మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వారి కోరికను నేరవేర్చేనా చూడాలి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.