Akhil-Surender Reddy : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్.. అధికారిక ప్రకటన..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా ప్రకటన Photo : Twitter

#Akhil5 : అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఉండనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

  • Share this:
    అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది పూజా హెగ్డే.  ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.


    ఇక ఈ సినిమా అలా ఉండగానే అఖిల్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: