Akhil Akkineni | అక్కినేని వారసుడు తన తన పుట్టినరోజును సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఏజెంట్ అంటే ఇలాగనే ఉంటాడు అనే తరహాలో ఉంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీటైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌తో పాటు నెల్లూరులోని కృష్ణపట్నం పోర్ట్‌లో పిక్చరైజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక అఖిల్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా ఇప్పటి వరకు అఖిల్ నటించిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్‌తో ‘ఏజెంట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
365 days back, I was challenged by @DirSurender to transform myself mentally and physically. Sir, the fire you have ignited in me will burn furiously through out this film. I promise you that. @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham @AKentsOfficial @S2C_Offl #AgentLoading pic.twitter.com/A29fyy8rTU
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 12, 2021
ఈ సినిమాలో మల్లూవుడ్‌లో స్టార్ హీరో మమ్ముట్టి కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మమ్ముట్టి గతంలో ‘యాత్ర’ ‘సూర్య పుత్రులు’, ‘రైల్వే కూలి’, స్వాతి కిరణం’ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించారు. ఇపుడు మరోసారి అఖిల్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.
అఖిల్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.
అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agent Movie, Akhil Akkineni, Most Eligible Bachelor, Surender reddy, Tollywood