Home /News /movies /

AKHIL SARTHAK MOTHER DURGA COMMENTS ON NAGARJUNA ANNOUNCING BIGG BOSS 4 WINNER MNJ

Akhil Mother Durga: నాగార్జున నా కుమారుడి చెయ్యిని అలా వదిలేసినప్పుడు బాధ అనిపించింది.. అఖిల్ తల్లి దుర్గ

అఖిల్ తల్లి దుర్గ

అఖిల్ తల్లి దుర్గ

105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజ‌న్ 4(Bigg Boss 4 Telugu) ఆదివారం ముగిసింది. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్(Abijeet) విన్న‌ర్ అవ్వ‌గా.. అఖిల్(Akhil) ర‌న్న‌ర్‌గా మిగిలారు. ఈ క్ర‌మంలో 25ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు ట్రోఫీని సొంతం చేసుకున్నారు అభిజీత్

ఇంకా చదవండి ...
    Akhil Mother Durga: 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఆదివారం ముగిసింది. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్ విన్న‌ర్ అవ్వ‌గా.. అఖిల్ ర‌న్న‌ర్‌గా మిగిలారు. ఈ క్ర‌మంలో 25ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు ట్రోఫీని సొంతం చేసుకున్నారు అభిజీత్. కాగా ఈ సీజ‌న్‌లో ర‌న్న‌ర్‌గా నిలిచిన అఖిల్‌కి బ‌య‌ట‌ మంచి క్రేజ్ వ‌చ్చింది. హౌజ్‌లో మోనాల్‌తో ప్రేమాయణం న‌డిపిన అఖిల్.. టాస్క్‌ల్లో త‌న‌దైన అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చాడు. ఒకానొక స‌మ‌యంలో అఖిల్ విన్న‌ర్ అవుతాడ‌న్న టాక్ న‌డిచింది. అయితే అత‌డి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌నే అఖిల్‌ని దెబ్బ తీసింద‌ని కొంత‌మంది విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇదిలా ఉంటే త‌న కుమారుడు ర‌న్న‌ర్ కాద‌ని, ఎంతోమంది గుండెల్లో విన్న‌ర్ అని చెప్పుకొచ్చారు అఖిల్ త‌ల్లి దుర్గ. అఖిల్ కోసం రెండు రోజులుగా తమ ఇంటికి వస్తున్నారని, తాను అనుకున్నది అఖిల్ సాధించాడని ఆమె అన్నారు.

    బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లేందుకు తాను క‌చ్చితంగా టాప్‌లో ఉంటాన‌న్న న‌మ్మ‌కంతో వెల్లాడ‌ని చివ‌ర‌కు అలానే వ‌చ్చాడ‌ని ఆమె వివ‌రించారు. ఎంతోమంది త‌మ కుమారుడికి ఓట్లు వేశార‌ని, అఖిల్‌ని గెలిపిస్తామ‌ని అభిమానులు నాకు మాటిచ్చార‌ని, నా కుమారుడు ఇప్ప‌టికీ విన్న‌ర్ అని దుర్గ చెప్పుకొచ్చారు. కాగా విన్న‌ర్‌ని ప్ర‌క‌టించే స‌మ‌యంలో నాగార్జున ఎడ‌మ‌చేతి వైపు అఖిల్ ఉండ‌గా.. అలా చేయిని వ‌దిలేయ‌డం త‌న‌కు బాధ‌ను అనిపించింద‌ని ఆమె తెలిపారు.

    Akhil Sarthak mother, Akhil Sarthak, Akhil Mother Durga, Nagarjuna, Bigg Boss 4 winner, Bigg Boss 4 Telugu, Akhil mother comments Nagarjuna, అఖిల్, అఖిల్ బిగ్ బాస్, అఖిల్ తల్లి దుర్గ, దుర్గ నాగార్జున
    అఖిల్ బిగ్ బాస్ 4


    ఏదైనా త‌న కుమారుడు ఆట‌ను బాగా ఆడి అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడ‌ని ఆమె పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ తాను ఫోన్ చేసి త‌న కుమారుడి గురించి అడిగి తెలుసుకునేదాన్న‌ని ఆమె అన్నారు. ఇక అభిజీత్, అఖిల్ ఇద్దరు మంచి సోదరులుగా ఉండేవారని.. ఇప్పుడు తన కుమారుడు రన్నర్ అవ్వడం తనకు ఏ బాధను కలిగించలేదని తెలిపారు.

    ఇదిలా ఉంటే మునుప‌టి సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్‌లో పాల్గొన్న చాలా మందికి మంచి ఫేమ్ వ‌చ్చింది. విన్న‌ర్‌గా నిలిచిన అభిజీత్‌కి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో పాటు మూడో స్థానంలో నిలిచిన సొహైల్‌కి ప‌లువురు ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే సొహైల్ సినిమాలో తాను చిన్న కెమెరా పాత్ర‌లో న‌టిస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి మాట ఇవ్వ‌గా.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొహైల్ చిత్రంలో న‌టిస్తాన‌ని హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అలాగే దివికి కూడా ఆఫ‌ర్లు బాగా వ‌స్తున్నాయి.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Television News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు