Akhil Akkineni-Pooja Hegde Most Eligible Bachelor | అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్లో చిత్రబృందం ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు అఖిల్, పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్‌ను కూడా షూట్ చేసారు. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తాజాగా విడుదలైన టీజర్లో అఖిల్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. తనకు కాబోయే వాడు.. తన కాళ్లకు చెప్పులా చెప్పినట్టు పడి ఉండాలనేకునే టైపు హీరోయిన్ను .. హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ. అంతేకాదు హీరోకు ఉమ్మడి కుటుంబం ఉండకూడదు. పెళ్లి తర్వాత తను చెప్పినట్టే వినాలి అంటూ పూజా చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా చేస్తున్నాయి.
ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని అభిమానులు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ఈ సినిమాను ఎపుడో రిలీజ్ కావాల్సి ఉన్న అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా లేట్ అయింది. అంతేకాదు వచ్చే సంక్రాంతి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హాట్రిక్ సక్సెస్ అందుకన్న అందాల అరవిందతోనైనా.. హీరోగా అఖిల్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood