హోమ్ /వార్తలు /సినిమా /

Akhil - Pooja Hegde - Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల తేది ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Akhil - Pooja Hegde - Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల తేది ఫిక్స్.. అధికారిక ప్రకటన..

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. బొమ్మరిల్లు తర్వాత 15 ఏళ్లుగా సరైన విజయం లేని ఈ దర్శకుడు.. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని అఖిల్‌తో కలిసి చేసిన సినిమా ఇది. ఈ ఇద్దర్నీ వరస విజయాలతో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కలిపింది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్‌, జోష్ దర్శకుడు వాసు వర్మ సంయుక్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను నిర్మించారు.

Akhil - Pooja Hegde : అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. 

    Akhil - Pooja Hegde : అఖిల్ (Akhil), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎపుడో  విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. అయితే మొన్నటి వరకు ఈ సినిమా విడుదలపై కొంత క్లారిటీ లేక అభిమానులు అందోళన చెందారు. కాగా తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదలకానుందో ప్రకటించింది చిత్రబృందం. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (Most Eligible Bachelor) అక్టోబర్ 8న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  ఇక వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది.

    అటు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కుమారుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.

    ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

    Happy Birthday Suman : చిరంజీవి, బాలయ్యలకు ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన సుమన్..

    ఇక ఆ సినిమా అలా ఉండగానే అఖిల్.. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు.  వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న ‘బంగార్రాజు’లో అఖిల్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhil Akkineni, Allu aravind, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood

    ఉత్తమ కథలు