హోమ్ /వార్తలు /సినిమా /

Akhil - Pooja Hegde: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పిక్ టాక్.. అఖిల్‌తో పూజా హెగ్డే అదిరిపోయే రొమాన్స్..

Akhil - Pooja Hegde: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పిక్ టాక్.. అఖిల్‌తో పూజా హెగ్డే అదిరిపోయే రొమాన్స్..

ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా చాలా బాగా వచ్చిందని వాళ్లు ప్రశంసలు కూడా కురిపించారు. సెప్టెంబర్ 30న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా చాలా బాగా వచ్చిందని వాళ్లు ప్రశంసలు కూడా కురిపించారు. సెప్టెంబర్ 30న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

Akhil - Pooja Hegde: కెరీర్ మొదలు పెట్టి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్ అక్కినేని (Akhil - Pooja Hegde). చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమాతో వస్తున్నాడు అఖిల్.

ఇంకా చదవండి ...

కెరీర్ మొదలు పెట్టి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్ అక్కినేని. చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో వస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్‌గా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది.

ఈ మేరకు అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని భాస్కర్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Pooja Hegde, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు