సమంతకు తలనొప్పులు తీసుకొచ్చిన అఖిల్.. నాగార్జున హర్ట్..

Samantha Akhil: అదేంటి.. సమంతకు అఖిల్ తలనొప్పులు తీసుకురావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 3, 2020, 8:44 PM IST
సమంతకు తలనొప్పులు తీసుకొచ్చిన అఖిల్.. నాగార్జున హర్ట్..
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)
  • Share this:
అదేంటి.. సమంతకు అఖిల్ తలనొప్పులు తీసుకురావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ మధ్యే రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. దీనికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా అఖిల్, పూజా హెగ్డే మధ్య ఉన్న రొమాంటిక్ పోస్టర్ కాస్త విమర్శలకు కూడా తావిచ్చింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే, అఖిల్ Photo : Twitter
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే, అఖిల్ Photo : Twitter


ముఖ్యంగా అఖిల్ చెవులను పూజా కాళ్లతో తాకడంతో అసలు రచ్చ మొదలైంది. ట్రోలింగ్ కూడా భారీగానే జరుగుతుంది వీటిపై. పోస్టర్ విడుదలై వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ దీనిపై రచ్చ మాత్రం ఆగట్లేదు. మరోవైపు సమంతకు ఈ పోస్టర్ సెగ తగులుతుండటం గమనార్హం. నాగార్జున కూడా ఈ విషయంపై కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అక్కినేని అఖిల్ (Twitter/Photo)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అక్కినేని అఖిల్ (Twitter/Photo)


నేనొక్కడినే సమయంలో మహేష్ బాబు కాళ్ల దగ్గర కృతి సనన్ ఉన్నపుడు తెలుగు సినిమాల్లో అమ్మాయిలకు అస్సలు వ్యాల్యూ లేకుండా పోతందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ల తీరుపై కామెంట్ చేసింది సమంత. ఆ వెంటనే శ్రీమంతుడులో శృతి హాసన్ కాళ్ళతో మహేష్ బాబును టచ్ చేస్తుంది. అప్పుడే సమంతకు షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇప్పుడు అఖిల్ చెవులను పూజా హెగ్డే తాకుతూ విడుదలైన పోస్టర్ చూసి సమంతపై సెటైర్లు వేసారు నెటిజన్లు.

సమంత అక్కినేని (samantha akkineni/Instagram)
సమంత అక్కినేని (samantha akkineni/Instagram)


మరోవైపు ఈ పోస్టర్‌పై నాగార్జున కూడా కాస్త హర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఎంత రొమాంటిక్ పోస్టర్ అయినా కూడా అలా కాళ్లతో తన్నే పోస్టర్‌తో కాస్త నొచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనా కూడా సమంత, నాగార్జునకు తలనొప్పులు తీసుకొచ్చాడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
Published by: Praveen Kumar Vadla
First published: August 3, 2020, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading